ఈ వారం ఓటీటీలో సినిమాల జాత‌ర‌.. ఏకంగా అన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయా..!

  • By: sn    breaking    Feb 14, 2024 12:33 PM IST
ఈ వారం ఓటీటీలో సినిమాల జాత‌ర‌.. ఏకంగా అన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయా..!

ప్ర‌తి వారం థియేట‌ర్‌తో పాటు ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సినంత వినోదం అందుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఫుల్ బజ్ క్రియేట్ అయిన అనేక కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మ‌రి ఈ వారం ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు ఏయే సినిమాలు సిద్ధంగా ఉన్నాయ‌నేది చూస్తే..ముందుగా థియేట‌ర్‌లో సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. జయం రవి హీరోగా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేసిన కొత్త సినిమా సైరెన్ కూడా ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో సంద‌డి చేయ‌నుంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ కాబోతుంది. అలాగే రాజధాని ఫైల్స్ సినిమా కూడా ఫిబ్రవరి 15వ తేదీనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నెట్‌ఫ్లిక్స్ లో కిల్‌ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) – ఫిబ్రవరి 13 నుండి స్ట్రీమింగ్ అవుతుండ‌గా, సదర్లాండ్‌ టిల్‌ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) – ఫిబ్రవరి 13, టేలర్‌ టామ్లిన్‌సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) – ఫిబ్రవరి 13 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక ఏ సోవేటో లవ్‌ స్టోరీ – ఫిబ్రవరి 14, గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 14, ది హార్ట్‌ బ్రేక్ ఏజెన్సీ – ఫిబ్రవరి 14, లవ్ ఇజ్ బ్లైండ్‌- సీజన్ 6(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 14, ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) – ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15, హోస్‌ ఆఫ్‌ నింజాస్(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15, లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) – ఫిబ్రవరి 15, రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15, ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15, ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై – ఫిబ్రవరి 15, క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 15 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

ఇక ది అబిస్(మూవీ) – ఫిబ్రవరి 16 నుండి, కామెడీ చావోస్(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16 నుండి, ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) – ఫిబ్రవరి 16 నుండి, ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో సంద‌డి చేయ‌నుంది. అమెజాన్‌ ప్రైమ్ లో ఫైవ్‌ బ్లైండ్‌ డేట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 13 నుండి స్ట్రీమ్ అవుతుండ‌గా, దిస్‌ ఈజ్‌ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16 నుండి స్ట్రీమ్ కానుంది. డిస్నీ+హాట్‌స్టార్ లో ఫిబ్రవరి 12 నుండి ట్రాకర్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమ్ అవుతుండ‌గా, ఫిబ్రవరి 14: సబ నయగన్‌ (తమిళ), ఫిబ్రవరి 15: ఓజ్లర్‌ (మలయాళం), ఫిబ్రవరి 16: సలార్‌ (హిందీ), ఫిబ్రవరి 17: నా సామిరంగ (తెలుగు) స్ట్రీమ్ కానుంది. ఇక జీ5లో ఫిబ్రవరి 14: క్వీన్‌ ఎలిజబెత్‌ (మలయాళం), ఫిబ్రవరి 16: ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్‌) స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో చూస్తే ఫిబ్రవరి 14: వీరమారి లవ్‌స్టోరీ (తమిళ) స్ట్రీమింగ్ కానుంది. ఆపిల్‌ టీవీ ప్లస్ లో ఫిబ్రవరి 14: ది న్యూ లుక్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమ్ కానుండ‌గా, సోనీ లివ్ లో ఫిబ్రవరి 12: రాయ్‌ సింఘానీ వర్సెస్‌ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్‌) స్ట్రీమ్ అవుతుంది.