బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. త‌న పేరు మార్చేసుకున్నాడుగా..!

బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. త‌న పేరు మార్చేసుకున్నాడుగా..!

ఒక‌ప్పుడు ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ పేరు తెలుగు రాష్ట్రాల‌లో కొంత మందికి మాత్ర‌మే తెలుసు. కాని ఇప్పుడు ఆయ‌న పేరు తెలియ‌ని వారు లేరు. బిగ్ బాస్ సీజ‌న్7 విన్న‌ర్‌గా నిల‌వ‌డంతో పాటు ఇటీవ‌ల జ‌రిగిన కాంట్ర‌వ‌ర్సీస్ ఆయ‌న పేరు మరింత మారు మ్రోగేలా చేశాయి. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసానికి కారణమయ్యాడన్న అభియోగాలపై ప్ర‌శాంత్‌ని చంచల్‌గూడ జైలుకి త‌ర‌లించ‌గా, తాజాగా ఆయ‌న‌కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్ట్ తీర్పు వెలువరించింది. ప్ర‌శాంత్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇక ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ త‌న పేరుని సోష‌ల్ మీడియాలో మార్చుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అత‌నికి ఇన్‌స్టాలో ఒక మిలియ‌న్‌కి పైగా ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, త‌న పేరు , బ‌యో కూడా ఇప్పుడు మార్చేశాడు. మ‌ల్ల వ‌చ్చిన‌, స్పై టీమ్ విన్న‌ర్‌గా త‌న‌ని తాను ప్ర‌క‌టించుకున్నాడు ప్ర‌శాంత్. అయితే ప్ర‌శాంత్ బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆయ‌న‌పై కొంద‌రు పాజిటివ్‌గా మరి కొంద‌రు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.పల్లవి ప్రశాంత్ తన అభిమానులని రెచ్చగొట్టే విధంగా వ్యహరించడంతో ఈ దాడులు జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొందరు సృష్టించిన అల్లర్లలో బిగ్ బాస్ సెలబ్రిటీల వాహనాలు, బస్సులు ధ్వంసం అయ్యాయి.

అమర్ దీప్ కారుపై అటాక్ చేయ‌డం వెన‌క ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఉన్నాడ‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు.అయితే విన్న‌ర్ అయిన ఆనందం ప్ర‌శాంత్‌కి ఎంతో సేపు లేక‌పోవ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ చాలా బాధ‌ప‌డ్డారు. పల్లవి ప్రశాంత్ లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు ..ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో అతనిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనల్ ముగిసిన తర్వాత విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రశాంత్.. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ర్యాలీగా వెళ్లాడని, రోడ్డుపై వాహనాలు ఆపాడాని అభియోగాలు చేశారు పోలీసులు.