ఎట్ట‌కేల‌కి హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయిన ప్ర‌భాస్..

ఇక సినిమాల‌తో బిజీబిజీ..!

ఎట్ట‌కేల‌కి హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయిన ప్ర‌భాస్..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ‌త రెండు నెల‌లుగా యూర‌ప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ప్రభాస్ చాలా కాలంగా కాలు నొప్పితో బాధపడుతున్న విష‌యం తెలిసిందే. మోకాలి నొప్పి ఎక్కువవ్వడంతో… దానికి సర్జరీ చేయించుకునేందుకు ఆయన ఇటీవ‌ల‌ యూరప్ వెళ్ళారు. ఆ సర్జరీ సక్సెస్ పుల్ గా కావ‌డం, నెల రోజుల పాటు విశ్రాంతి పూర్తి కావ‌డంతో ప్ర‌భాస్ తాజాగా హైద‌రాబాద్ లో అడుగుపెట్టారు. ఇక ప్ర‌స్తుతం స‌లార్ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్‌గా పాల్గొననున్నాడు. సలార్ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర‌ ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు. ద‌స‌రా, ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకి కూడా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మ‌రి దీవాలి నుండి ప్రమోష‌న్ వేగ‌వంతం చేస్తారా అనేది చూడాలి.

అయితే ప్ర‌భాస్ బాహుబలి సినిమా నుంచే మోకాలి నొప్పితో బాధ పడుతున్న విష‌యం తెలిసిందే. అయితే అప్పుడే స‌ర్జ‌రీ చేయించుకోవాల‌ని అనుకున్నాడు, కాని చిత్ర బిజీ షెడ్యూల్స్ వ‌ల‌న దృష్టి పెట్ట‌లేక‌పోయాడు. మ‌ధ్యలో తాత్కాలిక చికిత్స తీసుకున్నా కూడా నొప్పి అత‌డిని వేధిస్తూనే ఉంది. ఆ కాలు నొప్పితోనే ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ ని పూర్తి చేశాడు. అయితే నొప్పి రాను రాను మ‌రింత ఇబ్బందిగా మార‌డంతో సెప్టెంబర్ లో ఈ సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. ఆపరేషన్ ని గత నెలలోనే పూర్తి చేసుకున్నాడు.

నెల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్ప‌డంతో అక్కడే ఉండి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కంప్లీట్ గా రికవరీ అయ్యినట్లు తెలుస్తుండ‌గా, తాజాగా ఆయ‌న హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఎయిర్‌పోర్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక ప్ర‌భాస్ ఇప్పుడు స‌లార్ చిత్ర ప్ర‌మోష‌న్స్ తో పాటు తాను క‌మిటైన ఇత‌ర సినిమా షూటింగ్స్‌ని కూడా త్వ‌ర‌గా పూర్తి చేయ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది ప్ర‌భాస్ నుండి రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు తెలుస్తుంది.