ఈడీ దాడి చేస్తే తిరగబడండి.. నా కూతురినీ పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు సమయం పది నెలలే ఉంది.. బీజేపీతో పోరాడాల్సిందే… ఎమ్మెల్యేలకే టికెట్లు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ విధాత : కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీలు దాడులు చేస్తే తిరుగు బాటు చేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ సభ్యులతో మంగళవారం నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్యాప్తు చేస్తే.. ధర్నా ఈడీ ఎక్కడ దర్యాప్తు చేస్తే అక్కడ ధర్నాలు […]

- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
- సమయం పది నెలలే ఉంది..
- బీజేపీతో పోరాడాల్సిందే…
- ఎమ్మెల్యేలకే టికెట్లు
- స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
విధాత : కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీలు దాడులు చేస్తే తిరుగు బాటు చేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ సభ్యులతో మంగళవారం నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు.
దర్యాప్తు చేస్తే.. ధర్నా
ఈడీ ఎక్కడ దర్యాప్తు చేస్తే అక్కడ ధర్నాలు చేయాలన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్‌కు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు కేవలం పది నెలలు మాత్రమే సమయం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో బీజేపీ కుట్రలు
బీజేపీ రాష్ట్రంలో అనేక కుట్రలకు పాల్పడుతున్నది, ఆ కుట్రలను పటా పంచలు చేసి బీజేపీతో పోరాటం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. బీజేపీ కుట్రలను బట్టబయలు చేసిన ఎమ్మల్యేలను సీఎం కేసీఆర్ అభినందించారు.
ఎమ్మెల్సీ కవితను సైతం..
ఎమ్మెల్సీ కవితను సైతం కేసులు అడ్డం పెట్టుకొని పార్టీ మారాలని కోరారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకా ఏమైనా ఉందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి అనుకూలంగా ఉన్నాబీజేపీ నేతలు జగన్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు..
రాబోయే పది నెలలు కీలకమని, పార్టీ నాయకత్వం, క్యాడర్ అంతా క్షేత్ర స్థాయిలో ఉండి పని చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పని చేసి గెలుపునకు కారకులైన పార్టీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేశారు. ఇదే తీరుగా గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసి, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని సూచించారు.