ఏంటి.. అల్లు అర్జున్‌కి గాయమైందా..బ్యాండేజ్‌తో ఉన్న బన్నీని చూసి టెన్షన్‌లో ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ ఇప్పుడు సుకుమార్‌తో కలిసి పుష్ప2 చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అవుతుండడం చూసి అందరు షాక్ అవుతున్నారు. తాజాగా బన్నీకి సంబంధించిన పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుండగా, ఆ పిక్‌లో అల్లు అర్జున్ చేతికి బ్యాండ్‌తో కనిపించారు
పిక్ చూసి అల్లు అర్జున్ చేతికి ఏమైంది? గాయమైందా? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అల్లు అర్జున్ చేతికి దెబ్బ తగలడం నిజమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పుష్ప2 కోసం కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఎడమ చేతికి తేలికపాటి గాయమైందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినప్పటికి సినిమాకి సంబంధించి డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చేతి కట్టుతోనే బన్నీ అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడని అర్ధమవుతుంది. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది.ఇక బన్నీ గాయం తగ్గాక తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాడట
ఇక పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కావడం, ఇదే సినిమాకు బన్నీకి జాతీయ స్థాయి ఉత్తమ నటుడి పురస్కారం కూడా దక్కడంతో పుష్ప2 సినిమాపై ప్రతి ఒక్కరు ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా పుష్ప2ని మించి ఉంటుందని టాక్. ఈ చిత్రంలో అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. ముఖ్య పాత్రలలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాసిల్ , కన్నడ డాలీ ధనంజయ్ తదితరులు నటించారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ఫ 2 సినిమా విడుదల కానున్నట్టు తెలుస్తుండగా, ఈ మూవీకి పోటీగా పలు చిత్రాలు కూడా విడుదల కానున్నాయని అంటున్నారు.