రాజగోపాల్‌వి దొంగ నాట‌కాలు: ఎంపీ బడుగుల

విధాత‌: మునుగోడు ఉపఎన్నిక‌ల్లో ఓడిపోయిన రాజ‌గోపాల్‌రెడ్డి దొంగ నాట‌కాలు ఆడుతున్నాడ‌ని ఎంపీ బ‌డుగుల లింగ‌య్య‌యాద‌వ్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. గొల్ల కురుమల‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న‌7600 మంది గొల్ల కురుమల అకౌంట్ల‌లో డబ్బులు పడ్డాయ‌న్నారు. ఆనాడు రాజగోపాల్ రెడ్డి , బీజేపీ నాయకులే ఆ నిధులు గొల్ల కురుమ‌లు వినియోగించుకోవ‌డానికి వీలులేకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి […]

రాజగోపాల్‌వి దొంగ నాట‌కాలు: ఎంపీ బడుగుల

విధాత‌: మునుగోడు ఉపఎన్నిక‌ల్లో ఓడిపోయిన రాజ‌గోపాల్‌రెడ్డి దొంగ నాట‌కాలు ఆడుతున్నాడ‌ని ఎంపీ బ‌డుగుల లింగ‌య్య‌యాద‌వ్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. గొల్ల కురుమల‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

మునుగోడు నియోజకవర్గంలో ఉన్న‌7600 మంది గొల్ల కురుమల అకౌంట్ల‌లో డబ్బులు పడ్డాయ‌న్నారు. ఆనాడు రాజగోపాల్ రెడ్డి , బీజేపీ నాయకులే ఆ నిధులు గొల్ల కురుమ‌లు వినియోగించుకోవ‌డానికి వీలులేకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అకౌంట్లు ఫ్రీజ్ చేయించార‌న్నారు.

నాడు మీరే అకౌంట్లు ఫ్రీజ్ చేయించి నేడు తిరిగి ధర్నాలు చేయడం సిగ్గు చేట‌న్నారు. గొల్ల కురుమలకు అన్యాయం చేసిందే బీజేపీ పార్టీ అని ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం రాజ‌గోపాల్‌రెడ్డి చేస్తున్న‌దొంగ‌ దీక్షలు, ధర్నాలు మానుకోవాలని సూచించారు.

సమావేశంలో యాదవ సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్, కురుమ సంఘం జిల్లా కోశాధికారి చిన్నం బాలరాజు యాదవ్, చౌటుప్పల్ పట్టణ కౌన్సిలర్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు నల్ల గణేష్ యాదవ్, నార్ల కొండ నరసింహ, పాత రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.