మొన్న ఖాన్ త్ర‌యంతో స్టెప్పులేసిన‌ రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు స‌చిన్, అక్ష‌య్, సూర్య‌ల‌తో..

మొన్న ఖాన్ త్ర‌యంతో స్టెప్పులేసిన‌ రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు స‌చిన్, అక్ష‌య్, సూర్య‌ల‌తో..

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మూవీ దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌మ‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంది. ఇక ఈ మూవీలోని నాటు నాటు పాట‌కి గాను ఏకంగా ఆస్కార్ అవార్డ్ కూడా వ‌చ్చింది. అయితే ప‌లు ఈవెంట్స్‌లో ఈ పాట‌ని ప‌దే ప‌దే ప్లే చేయ‌డం, దానికి ప‌లువురు స్టెప్పులు వేయ‌డం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. రీసెంట్‌గా అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేషన్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఖాన్ త్ర‌యం అయిన అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ డ్యాన్స్ లు చేయ‌డం మ‌నం చూశాం.

ఇక ఇప్పుడు స‌చిన్ వంతు వ‌చ్చింది.ఇండియా స్ట్రీట్ సూపర్ లీగ్ 2024 ఆరంభ వేడుక‌లు బుధ‌వారం థానేలో ఘ‌నంగా జ‌రిగాయి. దడోజి కోనదేవ్ స్టేడియంలో జ‌రిగిన ఈ వేడుల‌క‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ లు, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.అయితే ఈవెంట్ మ‌ధ్య‌లో నాటు నాటు పాట ప్లే చేయ‌డంతో స‌చిన్‌, సూర్య‌, బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్, ర‌విశాస్త్రిల‌తో క‌లిసి చ‌ర‌ణ్‌ స్టెప్పులేశారు. అంతేకాదండోయ్ చీర్ గార్ల్స్‌తో క‌లిసి కూడా చ‌ర‌ణ్ డ్యాన్స్ చేశారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక రామ్ చ‌ర‌ణ్ క్రికెట్ లీగ్‌లోకి ఇప్ప‌టికే అడుగుపెట్టిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఇండియా స్ట్రీట్ సూపర్ లీగ్ టోర్నీలో మెగా ప‌వ‌ర్ స్టార్ హైద‌రాబాద్ జ‌ట్టును కొనుగోలు చేసారు. కాగా.. టెన్నిస్ బాల్‌తో జరిగే ఐఎస్‌పీఎల్‌ టీ10 క్రికెట్ లీగ్‌లో మొత్తం 6 జ‌ట్లు ఇందులో పోటీప‌డ‌నున్నాయి. మాజీ ముంబై, శ్రీనగర్ కే వీర్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సింగమ్స్, బెంగళూరు స్ట్రైకర్స్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్లు పోటీప‌డ‌బోతున్నాయి. అయితే టీంల విష‌యానికి వ‌స్తే మాజీ ముంబై ఫ్రాంచైజీని అమితాబ్ బచ్చన్, చెన్నై సింగమ్స్‌ను సూర్య శివకుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ హృతిక్ రోషన్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్టును సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు.