హల్దీ వేడుకలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ.. కాక్‌టెయిల్ పార్టీ పిక్స్ వైరల్

దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరి కొద్ది గంటలలో పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరగనుండగా, ఇప్పటికే మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబంతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఇటలీలో ల్యాండ్ అయ్యారు. పెళ్లి సంబరాలు కూడా మొదలయ్యాయి. ఆ దేశ కాలమానం ప్రకారం 31వ తేదీ రాత్రి హల్దీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు దుస్తులలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్పెషల్‌గా కనిపించారు. మెగా ఫ్యామిలీ మొత్తం హల్దీ వేడుకలలో పాల్గొని సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి అయితే స్టైలిష్ గా అదిరిపోయే స్వాగ్ తో కూర్చుని ఉన్న పిక్ అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఇక నాగబాబు తన భార్యతో క్యూట్ పిక్ దిగారు.
ఈ రోజు మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఖరారు చేయబడినట్టు తెలుస్తుండగా, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.టస్కిన్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరగనుంది. అయితే ఈ పెళ్లికి ముందు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. తమ బంధువులందరికీ కాక్ టెయిల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెగా కుటుంబ సభ్యులు అందరు కలిసి ఫొటోలు దిగారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా కనిపించగా, తల్లితో కలిసి రామ్ చరణ్ దిగిన ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఫొటోలలో కనిపిస్తుండగా, పవన్ ఏ ఫోటోలోను దర్శనమివ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.ఇప్పటికే పవన్ తన సతీమణితో ఇటలీ చేరుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే పెళ్లి ముగిసిన రెండు రోజుల తరువాత వారంతా ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అనంతరం మెగా ఫ్యామిలీ నవంబర్ 5న భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలెబ్రిటీలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ రిసెప్షన్‌కు హాజరవుతారని సమాచారం.అయితే వరుణ్ పెళ్లికి కొంత మంది గెస్ట్‌లకి మాత్రమే ఆహ్వానం అందగా, వారంతా సపరేట్ డ్రెస్ కోడ్ లో రావాలని రిక్వస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎల్లో, వైట్ లేదా పింక్ డ్రెస్సుల్లో పెళ్ళికి హాజరు కావాలని నూతన దంపతులు కోరడంతో వారు ఆ డ్రెస్ కోడ్‌లోనే వచ్చి సందడి చేయనున్నట్టు తెలుస్తుంది.