Breaking: తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. సంబురాల్లో మెగా ఫ్యామిలీ

విధాత‌: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం వచ్చేసింది. మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవికి, మెగా ఫ్యాన్స్‌ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఒక ప్రత్యేకమైన కార్డుతో తెలియచేశారు. తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఈ గుడ్ న్యూస్ ని ఆయన షేర్ చేసుకున్నారు. ఈ వార్తతో సోషల్ మీడియా షేక్ […]

Breaking: తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. సంబురాల్లో మెగా ఫ్యామిలీ

విధాత‌: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం వచ్చేసింది. మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవికి, మెగా ఫ్యాన్స్‌ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఒక ప్రత్యేకమైన కార్డుతో తెలియచేశారు.

తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఈ గుడ్ న్యూస్ ని ఆయన షేర్ చేసుకున్నారు. ఈ వార్తతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

చిరు ట్వీట్ భీభత్సంగా వైరల్ అవుతోంది. ఉపాసన, రామ్ చరణ్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ వార్తతో తాత అవుతున్న చిరంజీవికి, అలాగే పేరేంట్స్ అవుతున్న చరణ్‌, ఉపాస‌న‌ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.