గ్రూప్-4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

విధాత‌: రాష్ట్రంలో 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. వాటిలో గ్రూప్‌-1 సహా వివిధ కేటగిరిల పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టుల భర్తీ చివరి దశలో ఉండగా, మరికొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది. మొత్తం 80 వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఇప్పటివరకు 52వేల‌ పోస్టుల భర్తీకి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఆయా ఉద్యోగాల భర్తీ కోసం నియామక సంస్థలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగా […]

గ్రూప్-4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

విధాత‌: రాష్ట్రంలో 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. వాటిలో గ్రూప్‌-1 సహా వివిధ కేటగిరిల పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టుల భర్తీ చివరి దశలో ఉండగా, మరికొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది. మొత్తం 80 వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఇప్పటివరకు 52వేల‌ పోస్టుల భర్తీకి పరిపాలనా అనుమతి ఇచ్చింది.

ఆయా ఉద్యోగాల భర్తీ కోసం నియామక సంస్థలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగ నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. కీలకమైన 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తయ్యింది. ప్రిలిమినరీ కీ అభ్యంతరాలు అనంతరం ఫైనల్‌ కీ ప్రకటన కూడా పూర్తయింది. మెయిన్స్‌ అర్హులైన వారీ జాబితాను ప్రకటించాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో మెయిన్స్‌ నిర్వహించాలనే యోచనలో సర్వీస్‌ కమిషన్‌ ఉన్నట్టు సమాచారం.

663 గ్రూప్‌2 పోస్టులు, 1373 గ్రూ- 3 పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ భర్తీ ప్రక్రియను కూడా సర్వీస్‌ కమిషన్‌ ప్రారంభించాల్సి ఉన్నది. గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే గ్రూప్‌ -4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే.

9, 168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతున్నది. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉన్నది. ఈ పోస్టుల్లో కొన్ని కొత్త కొలువులు ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల, మండలాల్లో పంచాయతీ రాజ్‌ కార్యాలయాల్లో జూనియర్‌ పోస్టులను మంజూరు చేయాల్సి ఉన్నది. దీని కోసం పంచాయతీ రాజ్‌ శాఖలో 1,298 పోస్టులకు అనుమతి ఇవ్వాల్సి ఉన్నది.

దీనికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అనుమతి లభించిన వెంటనే కొత్త పోస్టులను మంజూరు చేయనున్నారు. అనంతరం గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుంది. ఆయా శాఖల నుంచి అవసరమైన వివరాలు సేకరించిన అనంతరం సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నది.