ఇక అసైన్డ్ భూములు అమ్ముకోవచ్చు?.. క్రమబద్దీకరణకు ప్రభుత్వం సన్నాహాలు!
చట్ట సవరణ దిశగా కసరత్తు విధాత: అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు 1977 అసైన్‌మెంట్ చట్టానికి సవరణలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ఆమోదించుకునే అవకాశాలున్నట్లు సమాచారం. 2023 చివరలో జరిగే ఎన్నికలకు ముందుగానే ఈ కొత్త స్కీమ్‌ను అమలులోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంగీస చేతిలో మట్టి కరిచిన నల్ల త్రాచు.. వీడియో వైరల్ […]

- చట్ట సవరణ దిశగా కసరత్తు
విధాత: అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు 1977 అసైన్‌మెంట్ చట్టానికి సవరణలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ఆమోదించుకునే అవకాశాలున్నట్లు సమాచారం. 2023 చివరలో జరిగే ఎన్నికలకు ముందుగానే ఈ కొత్త స్కీమ్‌ను అమలులోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్కీమ్‌ను అమలులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత, ఇతర పేద వర్గాల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు చట్ట సవరణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చట్టం ఆమోదం జరిగిన వెంటనే అమలులోకి తీసుకురావడానికి వీలుగా మార్గదర్శకాలు కూడ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే చేతులు మారిన అసైన్డ్ భూములు
రాష్ట్రంలో దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ధరణిలో అసేక అసైన్డ్ భూములు నిషేధిత జాబితాలోనో లేక, మిసింగ్ సర్వే నెంబర్లుగానో లేదా? ప్రభుత్వ భూమిగానో ఉన్నది. ఫలితంగా అనేక అసైన్ భూములకు చెందిన రైతులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాగా తీసుకొని ఆందోళనలకు సిద్దమైంది. అయితే ధరణి చట్టం అమలులోకి వచ్చిన తరువాత ధరణి భూములు ఏవిధంగాను క్రయవిక్రయాలు చేయలేని పరిస్థితి కూడ ఏర్పడింది.
అయితే ధరణికి ముందుగానే అనేక భూములు వివిధ కారణాలతో చేతులు మారాయి. కానీ పట్టా మారలేదు. దళితులు, బీసీలు, ఇతర పేద ప్రజలకు పలు సమయాలలో ప్రభుత్వం అసైన్ చేసిన భూములను వివిధ అవసరాలకు అమ్ముకున్నారు. ముఖ్యంగా పెండ్లిళ్లు, ఉన్నత చదువులు, వైద్యం తదితర అవసరాలు పక్క భూమికి చెందిన సామన్య రైతులకే విక్రయించారు. ఇలా చేతులు మారిన భూములు దాదాపు ఐదారు లక్షల ఎకరాల వరకు ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చట్టం మార్పు దిశగా…
కాంగ్రెస్ ప్రభుత్వం 1977లో అసైన్‌మెంట్ చట్టం తీసుకువచ్చింది. దళితులకు ఇచ్చిన భూములు తిరిగి భూస్వాముల పాలు కాకుండా ఉండడం కోసం ఈచట్టాన్ని తీసుకువచ్చింది. ఈ విధంగా దాదాపు 24 లక్షల ఎకరాల భూములను దళితులు, గిరిజనులు, ఇతర పేద వర్గాలకు అసైన్ చేశారు. అవి అన్యాక్రాంతం కాకుండా ఉండే విధంగా ఈచట్టాన్ని తీసుకువచ్చి పటిష్టంగా అమలు చేశారు. అయినప్పటికీ అనేక అసైన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అనేక మంది అసైనీ దారులు తమ అవసరాల కోసం ఇతరులకు విక్రయించారు.
ముఖ్యంగా నగరాల పక్కన ఉండే భూముల విలువ పెరిగింది. దీంతో రియల్ వ్యాపారులు కూడ పెద్ద ఎత్తున అసైన్ భూములు అతి తక్కువ ధరకు తీసుకున్నారు. ఇలా అనేక భూములు చేతులు మారాయి. ఇలాంటి స్థితి పోవాలంటే అసైన్ భూములకు పట్టాఇచ్చి పూర్తి హక్కులు ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.
ఈ మేరకు అసైన్ భూములను క్రమబద్దీకరించాలన్ననిర్ణయానికి సీఎంకేసీఆర్ వచ్చారు. ఈ విషయాన్ని ఆయన 2021 మార్చి 26వ తేదీన అసెంబ్లీలో అసైన్ భూముల సమస్యపై మాట్లాడారు. అసైనీ దారులకు పూర్తి హక్కులు కల్పించాలన్నారు. అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకువద్దామని తెలిపారు. ఈ మేరకు అఖిలపక్ష సమావేశం. దళిత ఎంపీలు, ఎమ్మెల్ల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తానని కూడ ప్రకటించారు.
అసైనీలకు పూర్తి హక్కులు- అవసరమైతే చట్టంలో మార్పు
2021 మార్చి 26వ తేదీన అసెంబ్లీలో సీఎం కేసీఆర్
“అసైనీలకు పూర్తి హక్కులు ఎందుకు ఇవ్వకూడదు. అనే ప్రశ్న వస్తోంది. ధర్మమైన ముచ్చట. సిటీ పక్కనే ఉండే అసైన్‌మెంట్ ల్యాండ్స్ ఉన్నయి. అవి ఆగడం లేదు, గద్దలు కొట్టేస్తున్నయి. వాళ్లకు ఆస్తి చెందాలంటే ఎలా? ఆయన ఆడ అమ్ముకుంటే ఎకరాకు రూ. 2 కోట్లు వస్తయి. అవతలకు వెళ్లి 10 ఎకరాలు, 20 ఎకరాలు కొనుక్కోగలుగుతాడు. అది ప్రైవేట్ వ్యక్తికి ఉంది కానీ పాపం ప్రైవేట్ వ్యక్తికి లేదు. దానికి ఒక కమిటీ పెడతరా ఏది చేస్తరో అఖిల పక్ష కమిటీ పెడతరా? ఆలోచించండి, ఆయామ్ ఫర్ ఇట్. ఎట్లా చేస్తే వాళ్లకు లాభం జరుగుతదో అదేవిధంగా అందరి కన్సన్‌సెస్ తీసుకొని కాన్షియస్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా పెడదాం. రూరల్ వ్యవసాయ భూములు మినహాయిద్దామా! అర్భన్‌లో అవకాశం ఇద్దామా! సాకల్యంగా మీరు చర్చించండి త్వరలోనే దళిత పార్లమెంటు సభ్యులు, దళిత శాసన సభ్యుల మీటింగ్ పిలుస్తా. అందులో అన్ని పార్టీలను పిలుస్తం. ఒక నిర్ణయం తీసుకుంటే వారికి లాభం జరుగుతుందేమోనన్న ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అందరం కలిసి అనుకుంటే చేసేటటువంటి ఆస్కారం ఉంటదేమో.. ఆలోచన చేసుకుందాం. వాళ్లకు నష్టం రాకుండా, వాళ్ల భూములు ఎవరు కొట్టేయకుండా, రక్షణ ఉండే విధంగా, పర్మిషన్ పెట్టి ఇద్దామా? దానికి ఏదన్న మార్గం తీద్దాం. తప్పకుండా వాళ్లకు కొంత లాభం అయిద్దనే ఉద్దేశం నాకు ఉంది. వాళ్లకు హక్కులు సంక్రమించాలి. కంప్లీట్ టైటిల్ రావాలి. ఆ ఆస్తి వాళ్లకే చెందాలి. ఏమి చేస్తే మంచిదో విధి విధానాలు రూపొందిద్దాం. అవసరమైతే చట్టం మార్పులు కూడ చేసుకుందాం.” అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.