సౌతాఫ్రికా టూర్‌కి ముగ్గురు కెప్టెన్లు.. మూడు ఫార్మాట్ల‌కి భార‌త బ‌ల‌గం ఇదే..!

సౌతాఫ్రికా టూర్‌కి ముగ్గురు కెప్టెన్లు.. మూడు ఫార్మాట్ల‌కి భార‌త బ‌ల‌గం ఇదే..!

ప్ర‌స్తుతం ఇండియా వేదిక‌గా ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ఆడుతున్న భార‌త్ మ‌రి కొద్ది రోజుల‌లో సౌతాఫ్రికా టూర్ వెళ్ల‌నుంది. అయితే ఈ టూర్ కోసం సెలక్షన్ కమిటీ ఎలాంటి టీమ్​ను ప్రకటిస్తుందనే దానిపైన కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే టీ20ల్లో తిరిగి టీమిండియాకు కెప్టెన్​గా ఉండాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పిస్తార‌ని చ‌ర్చ కూడా న‌డిచింది. హార్ధిక్ పాండ్యా గాయం వ‌ల‌న జ‌ట్టుకి దూరం కావ‌డంతో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌కి మాత్రం రోహిత్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేస్తార‌ని టాక్ నడిచింది. వాట‌న్నింటికి తాజాగా తెరదించారు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమిండియా టీ20, వన్డే, టెస్టు జట్లను బీసీసీఐ తాజాగా అనౌన్స్ చేసింది.

మొదట జరగబోయే టీ20, వన్డే సిరీస్ ల నుంచి తమను మినహాయించాల్సిందిగా రోహిత్ శర్మ, కోహ్లి బోర్డ్‌ను కోర‌డంతో టీ20ల‌కి సూర్య కుమార్ యాద‌వ్ నే కెప్టెన్‌గా కొన‌సాగిస్తూ వ‌న్డేల‌కి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉండ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. టెస్ట్ సిరీస్ కు రోహిత్, కోహ్లి తిరిగి రానున్నారు. ఇక పేస్ బౌలర్ మహ్మద్ షమి ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండ‌గా, అతడు పూర్తి ఫిట్ గా ఉంటే టెస్టులకు తిరిగి వస్తాడని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. సౌతాఫ్రికాతో డిసెంబర్, జనవరిలో జరగబోయే మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం మూడు వేర్వేరు జట్లను సెల‌క్ష‌న్ క‌మిటీ ప్రకటించింది.గ‌త కొద్ది రోజులుగా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంస‌న్ కి వ‌న్డేల‌లో చోటు ద‌క్కింది.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ జ‌ట్టు చూస్తే.. అందులో రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్ ఉన్నారు.


ఇక సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ జ‌ట్టు చూస్తే అందులో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్, అర్ష్‌దీప్, సిరాజ్ ఉన్నారు.


సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ జ‌ట్టుని చూస్తే అందులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, షమి, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.