తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ. 900 కోట్ల జ‌రిమానా.. ఎందుకంటే..?

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ భారీ జ‌రిమానా విధించింది. ఎలాంటి అనుమ‌తులు లేకుండా పాల‌మూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌ను చేప‌డుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఎన్జీటీ చెన్నై ధ‌ర్మాస‌నం విచారించింది. విచార‌ణ అనంత‌రం ఎన్జీటీ తెలంగాణ ప్ర‌భుత్వానికి షాకిచ్చేలా తీర్పును ఇచ్చింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5శాతం (సుమారు రూ.900 కోట్లు) జరిమానా విధిస్తూ ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పును వెలువ‌రించింది. పర్యావరణం సహా అనేక అనుమతులు తీసుకోకుండా […]

తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ. 900 కోట్ల జ‌రిమానా.. ఎందుకంటే..?

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ భారీ జ‌రిమానా విధించింది. ఎలాంటి అనుమ‌తులు లేకుండా పాల‌మూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌ను చేప‌డుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఎన్జీటీ చెన్నై ధ‌ర్మాస‌నం విచారించింది. విచార‌ణ అనంత‌రం ఎన్జీటీ తెలంగాణ ప్ర‌భుత్వానికి షాకిచ్చేలా తీర్పును ఇచ్చింది.

మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5శాతం (సుమారు రూ.900 కోట్లు) జరిమానా విధిస్తూ ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పును వెలువ‌రించింది. పర్యావరణం సహా అనేక అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం త‌న పిటిష‌న్‌లో పేర్కొంది.

ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ. 300 కోట్లు, పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప‌ర్యావ‌ర‌ణ న‌ష్ట ప‌రిహారానికి రూ. 528 కోట్లు, డిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 92.8 కోట్ల జరిమానాలను విధించింది ఎన్జీటీ చెన్నై ధ‌ర్మాస‌నం.

ఈ జరిమానాలన్నీ మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డులో జమ చేయాలని సూచించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.