సైలెంట్‌గా స‌లార్ ట్రైల‌ర్‌.. ఫ్యాన్స్‌కు పిచ్చి ఎక్కిస్తున్నదిగా

సైలెంట్‌గా స‌లార్ ట్రైల‌ర్‌.. ఫ్యాన్స్‌కు పిచ్చి ఎక్కిస్తున్నదిగా

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత నుండి అన్ని పెద్ద చిత్రాలే చేశాడు. సాహో చిత్రం హిందీలో అల‌రించిన తెలుగులో మాత్రం నిరాశ‌ప‌ర‌చింది. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌` డిజప్పాయింట్‌ చేశాయి. వ‌రుస ఫ్లాపులు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ఇప్పుడు అంద‌రి దృష్టి స‌లార్ మూవీపైనే ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో ప్ర‌భాస్ ఓ నాయకుడి పాత్రలో కనిపించబోతుండటంతో సినిమా నెక్ట్స్ లెవల్‌ ఉంటుందని, `కేజీఎఫ్‌`ని మించి ఉంటుందని అంద‌రు భావించారు.

స‌లార్ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇందులో ప్ర‌భాస్‌ని స‌రిగా చూపించ‌నందుకు ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. ఇక ట్రైల‌ర్ కోసం చాలా రోజుల నుండి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 1న `సలార్‌` ట్రైలర్‌ని విడుదల చేయ‌గా, ఇది వారి అంచనాలను రీచ్‌ కాలేదనే టాక్‌ వినిపిస్తుంది. ప్ర‌శాంత్ నీల్ సినిమా అంటే ఇందులో భారీ ఎలివేషన్లు, విరోచితమైన యాక్షన్‌ ఎపిసోడ్లు, భారీ డైలాగులు ఉంటాయని అనుకోగా, అవేవి ట్రైల‌ర్‌లో క‌నిపించ‌లేద‌ని ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ప్రభాస్‌ డైలాగ్‌ డెలివరీపై కూడా తీవ్ర అసంతృప్తి ఎదురవుతుంది. ప్రభాస్‌ డైలాగ్‌లో అంత ఈజ్ లేక‌పోగా, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు కూడా క‌నిపించ‌లేద‌ని, ప్ర‌భాస్‌ని కూడా అంత స్ట్రాంగ్‌గా చూపించ‌లేద‌ని అంటున్నారు.

ఇక బీజీఎం విషయంలోనూ కొంత అసంతృప్తిఉంది. సినిమాలో చాలా వరకు `కేజీఎఫ్‌`ని తలపించే సీన్లు ఉండ‌డంతో ఇది కేజీఎఫ్‌కి కంటిన్యూగా ఇది సాగుతుందా అనే అనుమానాల అంద‌రిలో వ్యక్తమవుతున్నాయి. సీన్ల పరంగా, లొకేషన్ల పరంగా చాలా సిమిలారిటీస్ క‌నిపించ‌గా, మ్యూజిక్‌ పరంగా కూడా కొంత కనెక్షన్‌ ఉందని అంటున్నారు. ట్రైల‌ర్‌లో మొదట్నుంచి కథ చెప్పడం, అది చాలా సాధాసీదాగా అనిపించడంతో స్టఫ్‌ లేదని, అంచనాలు డైనోసార్‌ స్థాయిలో ఉంటే, రియాలిటీ యానిమేషన్‌ లా ఉందని నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. స‌లార్‌కి పోటీగా షారూఖ్ ఖాన్‌ `డంకీ` కూడా రిలీజ్ కానుండ‌గా, ఆ సినిమాతో ఇది పోటీ ప‌డ‌డం క‌ష్ట‌మే అని కొంద‌రు అంటున్నారు. ప్ర‌స్తుతానికి ట్రైలర్‌ మాత్రం సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. ట్రైలర్‌ ఇరవై నిమిషాల్లోనే రెండు మిలియన్స్ వ్యూస్‌ పొందింది. రెండు గంటల్లో ఐదు మిలియన్స్ దాటింది.