బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. ఆమెతో పులిహోర క‌లిపిన యావ‌ర్

బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. ఆమెతో పులిహోర క‌లిపిన యావ‌ర్

బిగ్ బాస్ సీజ‌న్ 7 చివ‌రి వారం కావ‌డంతో నామినేష‌న్స్, కెప్టెన్ టాస్క్‌లు ఇలాంటివి ఏవి లేవు. ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఏవో స‌ర‌దా టాస్క్‌లు మాత్ర‌మే ఇస్తున్నారు. గ‌త రెండు రోజుల నుండి ఇంటి నుండి వ‌చ్చిన ఫుడ్‌ని ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్ ఫన్నీ టాక్స్ తో సందడి చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ గేమ్ లో ఈ ఆరుగురు సభ్యులు ఒకరి పాత్రను మరొకరు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో మొదట అమర్ దీప్ గా అర్జున్, ఆ తర్వాత శివాజీ ఇమిటేట్ చేశారు. ఇద్దరూ అమర్ దీప్ లోని యాంగర్ యాంగిల్ నే ప్రదర్శించారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను అర్జున్, యావర్ ఇమిటేట్ చేసి న‌వ్వులు పూయించారు.

అర్జున్ .. పల్లవి ప్రశాంత్ బాడీ లాంగ్వేజ్, యాస, భాషతో అదరగొట్టారు. ఇక ఆ తర్వాత శివాజీని ఇమిటేట్ చేసిన ప్రియాంక అతను హౌజ్ లో కాఫీ పొడి కోసం చేసిన ర‌చ్చ‌కి సంబంధించిన స‌న్న‌వేశాల‌ని ఇమిటేటింగ్ చేసింది. ఇక ఆ స‌మ‌యంలో అమ‌ర్‌దీప్‌ని శివాజీ దింపేసాడు. మొత్తానికి వేరే పాత్ర‌ల‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తెగ సంద‌డి చేశారు. ఇక అదే స‌మ‌యంలో బిగ్ బాస్ హౌజ్‌లోకి యాంక‌ర్ శ్రీముఖి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీముఖి అడుగుపెట్టింది. కంటెస్టెంట్స్‌తో క‌లిసి తెగ ర‌చ్చ చేసింది.

కంటెస్టెంట్లతో కలిసి సందడి చేస్తూ, వారితో డ్యాన్స్‌లు చేయిస్తూ నానా ర‌చ్చ చేసింది. ప‌లు గేమ్స్ కూడా ఆడించింది. ట్రూత్ అండ్ డేర్ గేమ్ లో బిగ్ హౌజ్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఎవరితో దగ్గర ఉంటరని అడగ్గా.. నైని పావని తో టచ్ లో ఉంటారన్నారు. యావ‌ర్‌.. అశ్వినిని పెళ్లి చేసుకుంటాన‌ని అన్నాడు. ఇక ఆ త‌ర్వాత యావర్ తో శ్రీముఖి రొమాంటిక్ డాన్స్ చేసి ఆకట్టుకుంది. అనంతరం హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ సూట్ కేసు ను ఆఫర్ చేశారు. మొదట రూ.3 లక్షలతో.. ఆ తర్వాత రూ.5 లక్షలతో ఆఫర్ ఇచ్చిన‌ప్పటికీ ఎవ‌రు అంగీకరించలేదు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ఎంత ఆశిస్తున్నారో కూడా శివాజీ అడిగి చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆ తర్వాత బిగ్ బాస్ బ్రిఫ్ కేస్ సూట్ ను రూ.10 లక్షలకు పెంచినా ఎవరూ టెంప్ట్ కాలేదు. మరి నేటి ఫినాలే ఎపిసోడ్‌లో ఎవ‌రు విజేత అవుతారు తేల‌నుంది.