విధాత: సినీ వినీలాకాశంలో ఇంకో ధ్రువతార రాలిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త మరువక ముందే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ (79) సినీ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేశారు. వెండితెరకు ఎన్నో సొగసులు అద్దిన నట శేఖరుడు కృష్ణ సోమవారం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. కొంతకాలంగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉన్నారు. కొడుకు రమేష్ బాబు, భార్యలు విజయ నిర్మల, ఇందిరా దేవి మృతి చెందడంతో కృష్ణ […]
విధాత: సినీ వినీలాకాశంలో ఇంకో ధ్రువతార రాలిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త మరువక ముందే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ (79) సినీ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేశారు. వెండితెరకు ఎన్నో సొగసులు అద్దిన నట శేఖరుడు కృష్ణ సోమవారం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు.
కొంతకాలంగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉన్నారు. కొడుకు రమేష్ బాబు, భార్యలు విజయ నిర్మల, ఇందిరా దేవి మృతి చెందడంతో కృష్ణ తీవ్ర మనస్తాపంతో కృంగిపోయారు. ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై పడుతూ వచ్చింది. దీనితో ఆదివారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు.
ఆ ఇద్దరు హీరోయిన్లతోనే కృష్ణ అత్యధిక సినిమాలు..
తెల్లవారుజామున 2 గంటలకు ఆయన కార్డియకరెస్ట్కు గురవగా నానక్‌రాం గూడ కాంటినెంటల్ దవాఖానకు తరలించగా వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో సోమవారం రెండు సార్లు హెల్త్ బులిటెన్స్ విడుదల చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చారు. పొద్దున్నుంచి వెంటిలేటర్ మీదే ఉన్నారని, 8 మంది డాక్టర్ల అబ్జర్వేషన్ చేస్తున్నామన్నారు.
క్రిటికల్ స్టేజిలో ఉన్నాడరని, గుండె మినహ అన్ని అవయవాలు తెబ్బతిన్నాయని తెలిపారు. మా వద్ద ఉన్న అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో వైద్యం అందిస్తున్నామని. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్లినా ఇంతకు మించి ఏమి చేయరని తెలిపారు. అయితే.. డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా.. కృష్ణను కాపాడ లేకపోయారు. ఆయన మంగళవారం 4 గంటలకు మృతి చెందినట్లుగా డాక్టర్స్ ధృవీకరించారు.
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ ఒక పిల్లర్‌గా నిలబడ్డారు. ఆయన చేయని ప్రయోగం లేదు.. ఆయన చేయని పాత్రలేదు. వెండితెరకు ఎప్పటికప్పుడు ఆయన కొత్తదనాన్ని పరిచయం చేస్తూ.. టాలీవుడ్ చరిత్రను ఓ స్థాయికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో 31 మే, 1943న ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు ఇద్దరు భార్యలు. కులగోత్రాలు సినిమాతో ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 350 పైగా చిత్రాలలో ఆయన నటించి, ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అభిమానుల సందర్శనార్ధం కృష్ణ పార్థీవదేహాన్ని గచ్చీబౌలి స్టేడియానికి తరలించే అవకాశం ఉంది.