పెళ్లీడు వ‌చ్చిన కూతురు ఉన్న సురేఖా వాణి బాయ్ ఫ్రెండ్ కావాలంటుందేంటి?

పెళ్లీడు వ‌చ్చిన కూతురు ఉన్న సురేఖా వాణి బాయ్ ఫ్రెండ్ కావాలంటుందేంటి?

న‌టి సురేఖా వాణి ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోయిన ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంది. సురేఖా గ‌తంలో ప‌లు చిత్రాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి అలరించింది. భద్ర, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, నమో వెంకటేశ చిత్రాల్లో సురేఖావాణి క్రేజ్‌ని అమాంతం పెంచేశాయి. చూడ చక్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో సురేఖా వాణి చాలా ఏళ్ల పాటు ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటింది.అయితే ఈ మ‌ధ్య ఎందుకో సురేఖా వాణి అంత‌గా క‌నిపించ‌డం లేదు. ఆమెకు ఆఫర్స్ కూడా అంతగా రావడం లేదు. 2019లో సురేఖావాణి భర్త సురేష్ తేజ మరణించ‌డంతో అప్ప‌టి నుండి సినిమాల‌కి కాస్త దూర‌మైంద‌నే చెప్పాలి. భ‌ర్త మ‌ర‌ణం ఆ త‌ర్వాత 2020లో లాక్ డౌన్ రావ‌డం సురేఖా వాణి కెరీర్‌కి పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పాలి.

అయితే సురేఖా వాణి సినిమాలు చేయ‌క‌పోయిన ఆమె సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది. ముఖ్యంగా కూతురు సుప్రితతో క‌లిసి ఆమె చేసే ర‌చ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇద్ద‌రు త‌ల్లి కూతుళ్ల మాదిరిగా కాకుండా ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటూ ర‌చ్చ చేస్తుంటారు. అయితే సురేఖా వాణి రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారాలు సాగాయి. దీనిపై సురేఖా కూతురు సుప్రిత స్పందిస్తూ.. మీ ప్రయోజనాల కోసం తప్పుడు రాతలు రాయకండని వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజాగా సురేఖావాణి, తన కూతురు సుప్రీతతో కలిసి ఓ యూట్యూబ్‌ ఇంటర్వూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ.. నాకోక బాయ్ ఫ్రెండ్ కావాలి అని అన‌గా ఆ స‌మ‌యంలో సురేఖా వాణి కూడా నాక్కూడా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలని అంటంది. అంతేకాదు మంచి మనస్సు ఉన్న వ్యక్తి అయ్యి ఉండి.. హైట్ అండ్ నైస్ ఫిజిక్ ఉండాలంటూ త‌నకి కాబోయే బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండ‌గా, మ‌రి ఎంత మంది ఫ్యాన్స్ సురేఖా వాణి బాయ్ ఫ్రెండ్‌గా ఉండేందుకు పోటీ ప‌డ‌తారు అనేది చూడాలి.