బ్రేకింగ్: TRSలో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
విధాత: మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారు. ప్రభావశీలమైన నాయకుడు దాసోజు టీఆర్ఎస్‌లో చేరడం శుభపరిణామం అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే నేత కేసీఆర్ మాత్రమే అని అన్నారు. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌పై కేటీఆర్ ప్రశంసలు TRSలో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లపై […]

విధాత: మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారు.
ప్రభావశీలమైన నాయకుడు దాసోజు టీఆర్ఎస్‌లో చేరడం శుభపరిణామం అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే నేత కేసీఆర్ మాత్రమే అని అన్నారు.
స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌పై కేటీఆర్ ప్రశంసలు
TRSలో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో స్వామి గౌడ్ వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. ప్రభావ శీలమైన నాయకుడు దాసోజు శ్రవణ్ టీఆర్‌ఎస్‌లో చేరడం శుభపరిణామం అని పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ ప్రశంసించారు. అనంతరం వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్వామిగౌడ్, శ్రవణ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉద్యమ కాలంలో కలిసి పని చేసిన సహచరులం మేం. అక్కడక్కడ ఫంక్షన్లలో, ఇతర కార్యక్రమాల్లో కలుసుకునే వాళ్లం. ఆ సమయంలో పార్టీలను పక్కన పెట్టి ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్లం.. అనుబంధాన్ని పంచుకున్నా.. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామని గుర్తు చేశారు.

మళ్లీ తిరిగి కలిసి పని చేసే గొప్ప అవకాశం కలిగిందని, ఉద్యమంలో పని చేసిన ప్రతి బిడ్డ.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, కార్యక్రమాలను గమనించి వందకు వంద శాతం.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందని అంగీకరిస్తారని అనుకుంటున్నట్టు కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.