హౌజ్ నుండి బయటకు వచ్చిన టేస్టీ తేజపై దాడి.. ఎవరు చేశారు, ఎందుకు చేశారు..!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్స్ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తమదైన స్టైల్‌లో గేమ్ ఆడుతూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. ఇక హౌజ్ నుండి బయటకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నానా హంగామా చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 జరుగుతుంది. ప్రతి వారం ఎవరో ఒక కంటెస్టెంట్ హౌజ్ నుండి బయటకు వస్తున్నారు. రీసెంట్‌గా టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌజ్‌ని వీడాడు. ఎలిమినేట్ కావడం తనకేమి బాధగా లేదని, పదో వారం వరకు ఉంటే తన తల్లి బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టేది అని, ఆమె కోరిక తీర్చకుండా వెళుతున్నందుకే కొంత బాధ ఉందని చెప్పుకొచ్చాడు.
అయితే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ టేస్టీ తేజకి గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. అదేవిధంగా ర్యాలీగా కలిసి హౌజ్ నుంచి బయల్దేరారు. అభిమానులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఊహించని విధంగా కొందరు అతనిపై దాడి చేసినట్టు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ అభిమానులే అతనిపై దాడి చేసారని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలు, బహిరంగ సభలు, టపాసులు పేల్చడంపై పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వాటిని పట్టించుకోకుండా టేస్టీ తేజ బాంబులు కాల్చుతూ ఆ ప్రాంతంలోని వారిని అర్ధరాత్రి అసౌకర్యానికి గురిచేశాడని, టేస్టీ తేజను ఊరేగింపుగా తీసుకొచ్చిన స్నేహితులు కొందరు మద్యం సేవించి రోడ్డుపై నానా హంగామా చేయడంతో గొడవ జరిగిందని కొందరు అంటున్నారు.
అయితే పోలీసులు రంగంలోకి దిగి అందరిని పంపించి వేసి, గొడవ సద్దుమణిగేలా చేసినట్టు ప్రచారం జరుగుతుంది. బయటికి వచ్చిన రోజే తేజాకు ఇలాంటి అనుభవం ఎదురవడం అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 షోలోకి వెళ్తున్న సమయంలో మీడియా వర్గాలను సపోర్ట్ చేయాలని కోరిన టేస్టీ తేజ వారిపై మండిపడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంటర్వ్యూ ఇస్తానని వారిని విసిగించి చివరకు ఇవ్వకుండా, అసభ్యపదజాలం మాట్లాడడం టేస్టీ తేజపై నెగెటివిటీ ఏర్పడేలా చేసింది. తొమ్మిదివారాల పాటు హౌజ్‌లో బాగానే అలరించిన తేజ రెమ్యునరేషన్ బాగానే అందిపుచ్చుకున్నట్టు సమాచారం.