పులి దాడి.. వ్య‌క్తి మృతి.. ఎక్క‌డంటే

విధాత: అడ‌వుల జిల్లా ఆసిఫాబాద్‌లో ఒక వ్య‌క్తిపై పులి దాడి చేసింది. పులి దాడిలో స‌ద‌రు వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే… కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన‌ చౌపాన్ గూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అనే రైతు, పోడు భూముల సర్వే కోసం అధికారులు వస్తున్నారని భావించి చేనులోకి వెళ్లాడు. అక్క‌డే మాటు వేసి ఉన్న‌పులిని రైతు భీము గ‌మ‌నించలేదు. ఇదే […]

పులి దాడి.. వ్య‌క్తి మృతి.. ఎక్క‌డంటే

విధాత: అడ‌వుల జిల్లా ఆసిఫాబాద్‌లో ఒక వ్య‌క్తిపై పులి దాడి చేసింది. పులి దాడిలో స‌ద‌రు వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే… కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన‌ చౌపాన్ గూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అనే రైతు, పోడు భూముల సర్వే కోసం అధికారులు వస్తున్నారని భావించి చేనులోకి వెళ్లాడు.

అక్క‌డే మాటు వేసి ఉన్న‌పులిని రైతు భీము గ‌మ‌నించలేదు. ఇదే అదునుగా ఆ పులి భీముపై ఒక్క‌సారిగా దాడి చేసి గాయ ప‌రింది. దీంతో భీము అక్కడికక్కడే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న అధికారులు సంఘ‌టనా స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రిస్తున్నారు.