నాటు నాటు పాట స్టెప్స్ కాపీ కొట్టిన బాలీవుడ్ స్టార్ హీరోస్‌.. తెగ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

నాటు నాటు పాట స్టెప్స్ కాపీ కొట్టిన బాలీవుడ్ స్టార్ హీరోస్‌.. తెగ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయి అంచెలంచెలుగా పెరుగుతుంది. ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమా హీరోలు టాలీవుడ్‌ని చాలా చిన్న చూపు చూసేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. ఖాన్ హీరోలు సైతం టాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. బాహుబ‌లి2, పుష్ప‌, ఆర్ఆర్ఆర్ చిత్రాల త‌ర్వాత తెలుగు సినిమా స్థాయి ఎక్క‌డికో వెళ్లింది. అనేక జాతీయ అవార్డ్‌లు, ఆస్కార్ అవార్డ్‌లు సైతం టాలీవుడ్ సినిమాల‌కి వ‌స్తుండ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌నపైనే ఉంది. ఇక ఇటీవ‌ల బాలీవుడ్ మేక‌ర్స్ మ‌న సినిమాల‌ని స్పూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తుండ‌డం మనం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఏకంగా మ‌న తెలుగు సినిమాలోని సాంగ్‌కి సంబంధించిన స్టెప్స్ వారి సినిమాలో పెట్టుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ స్టార్స్ అక్ష‌య్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి ‘బడేమియా ఛోటేమియా’ అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీని అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. మ‌రి కొద్ది రోజుల‌లో సినిమాని రిలీజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, ప్ర‌మోషన్ స్పీడ్ పెంచారు. ‘మస్త్ మలాంగ్ ఝూమ్‌’ అంటూ సాగే పాట‌ని రిలీజ్ చేయ‌గా, ఇందులో అక్ష‌య్, టైగ‌ర్ వేసిన స్టెప్పులు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సాంగ్‌లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్.. ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు పాటకి రామ్ చరణ్- ఎన్టీఆర్ వేసిన హుక్ స్టెప్పును సేమ్ టూ సేమ్ వేశారు అంటూ కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.

ఆస్కార్ ద‌క్కించుకున్న పాట‌ని మ‌ళ్లీ రీ క్రియేట్ చేయ‌డం మీకు ఏమైన స‌మంజ‌సంగా అనిపించిదా.. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఎంతో ఈజ్‌తో స్టెప్పులు వేశారు. మీరు అంత ఈజ్‌తో వేయ‌లేక‌పోయారు అంటూ నెటిజ‌న్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ హీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 ఈద్ సందర్భంగా చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే చిన్న ప్రోమో సాంగ్‌కి నెటిజ‌న్స్ ఈ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తుంటే థియేట‌ర్‌లో చూశాక ఇంకెంత ర‌చ్చ చేస్తారో చూడాలి. కాగా నాటు నాటు పాట మారు మూల పల్లెల నుంచి ఆస్కార్ స్టేజ్ వరకూ ప్రతి ఒక్కరినీ ఓ ఊపు ఊపేసిందనే చెప్పాలి.