ఈ ఏడాది ఓటీటీలో దుమ్ము రేపిన టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఏంటంటే..!

  • By: sn    breaking    Dec 29, 2023 10:26 AM IST
ఈ ఏడాది ఓటీటీలో దుమ్ము రేపిన టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఏంటంటే..!

క‌రోనా కార‌ణంగా ఓటీటీల‌కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఓటీటీలో వ‌చ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఓటీటీలో వ‌చ్చే కంటెంట్‌పై ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఏడాది ముగుస్తుండ‌డంతో ఈ వారం ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేసిన వెబ్ సిరీస్‌లు చూస్తే టాప్ లో దూత ఉంటుంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన దూత సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సిరీస్ విక్ర‌మ్, నాగ చైత‌న్య‌కి మంచి పేరు తీసుకొచ్చింది… ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

రెండోది బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, తమిళ స్టార్ నటుడు అయిన విజయ్ సేతుపతి మెయిన్ రోల్ లో వచ్చిన ఫ‌ర్జీ. తాత స్థాపించిన ఒక పత్రిక కార్యాలయం మూతపడుతుంది దాన్ని ఎలాగైనా సరే ఓపెన్ చేయాలని యువకుడు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగే క‌థ‌తో దీనిని రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది…మూడోది రామా నాయుడు. కెరీర్‌లో తొలిసారిగా బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు వెంక‌టేష్‌. రానా కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నాలుగోది రియల్ స్టోరీ ది రైల్వే మెన్. 1984వ సంవత్సరంలో గ్యాస్ లీకేజీని ఈ సీరీస్ లో చాలా అద్భుతంగా చూపించారు. ఈ సిరీస్ నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఐదోది… కలాపాని.అండమాన్ నికోబార్ దీవుల్లోని నీరు ఎందువల్ల కలుషితమవుతుంది అనే పాయింట్‌తో రూపొందించ‌గా, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది…ఆరోది ది ఫ్రీలాన్సర్. ఐసీస్ వలలో చిక్కుకున్న మహిళని ఒక వ్యక్తి కాపాడడానికి ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లించిందా అనేది సినిమా క‌థ‌. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది… ఏడోది సేవ్ ది టైగర్స్. ముగ్గురు భర్తలు వాళ్ళ భార్యల చేతుల్లో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు అనే కథాంశంతో ఇది రూపొందింది. ఇక ఎన‌మిదోది…స్కామ్ 2003 ది తెల్గి స్టోరీ. 2003 వ సంవత్సరంలో స్టాంప్ పేపర్ మోసానికి గురైన అబ్దుల్ కరీం తెలుగు జీవిత కథ ఆధారంగా రూపొంద‌గా, ఇది సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…తొమ్మిదోది..దహాద్. ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయిన ఒక అమ్మాయి కేసుని సాల్వ్ చేయడమే ఈ సీరీస్ మెయిన్ ప్లాట్ సిరీస్ కాగా, ఇది సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప‌దోది పిప్పా. ఇషాన్ కట్టర్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…