టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. రేపే జెండా ఆవిష్క‌ర‌ణ‌

విధాత: ఉద్య‌మ పార్టీగా అవ‌త‌రించిన టీఆర్ఎస్ పార్టీ భార‌త రాష్ట్ర స‌మితిగా మారింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా కేసీఆర్‌కు లేఖ రాసింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. బీఆర్ఎస్‌కు ఎన్నిక‌ల సంఘం ఆమోద ముద్ర వేసింది. పార్టీ మార్పున‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. ఈ ఏడాది ద‌స‌రా ప‌ర్వ‌దినం(అక్టోబ‌ర్ 5) నాడు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా […]

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. రేపే జెండా ఆవిష్క‌ర‌ణ‌

విధాత: ఉద్య‌మ పార్టీగా అవ‌త‌రించిన టీఆర్ఎస్ పార్టీ భార‌త రాష్ట్ర స‌మితిగా మారింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా కేసీఆర్‌కు లేఖ రాసింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. బీఆర్ఎస్‌కు ఎన్నిక‌ల సంఘం ఆమోద ముద్ర వేసింది. పార్టీ మార్పున‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది.

ఈ ఏడాది ద‌స‌రా ప‌ర్వ‌దినం(అక్టోబ‌ర్ 5) నాడు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా రోజు కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించిన తీర్మానంపై సంత‌కం చేశారు. సుమారు 8 రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు కూడా నాటి టీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌రై బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితి భార‌త రాష్ట్ర స‌మితిగా మారిన నేప‌థ్యంలో రేపు తెలంగాణ భ‌వ‌న్‌లో ఆ పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యామ్నం 1:20 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ వేదిక నుంచి బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించ‌ నున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు.