రాజకీయాల్లోకి మెగా కోడ‌లు.. అతి త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇవ్వ‌నుందంటూ ప్ర‌చారం

రాజకీయాల్లోకి మెగా కోడ‌లు.. అతి త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇవ్వ‌నుందంటూ ప్ర‌చారం

రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.త‌న వ్య‌క్తిత్వంతో ప్ర‌జ‌ల మ‌న‌స్సు చూర‌గొంటున్న ఉపాస‌న అపోలో సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఉపాస‌న ఇటీవ‌ల పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా ఆ చిన్నారిని ఎంతో కేరింగ్‌గా చూసుకుంటూనే మ‌రోవైపు మిగ‌తా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. దీంతో ఆమె రాజ‌కీయాల‌లోకి రావ‌డం ఖాయం అంటూ కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు.

తాజా ఇంట‌ర్వ్యూలో ఉపాస‌న మాట్లాడుతూ..త‌మిళ హీరో విజ‌య్ సినిమాల ద్వారా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారని పేర్కొంది. ప్ర‌జ‌ల‌కి సేవ చేయాల‌ని ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం చాలా గొప్ప‌ద‌ని, ఈ విష‌యంలో నేను చెప్పాల‌నుకున్న‌ది ఇదొక్క‌టే అంటూ ఉపాస‌న కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది ..మీకు రాజ‌కీయాల‌లో మార్పు కావాలి అనుకున్నప్పుడు, లీడర్ ఎవరని చూడకుండా వారికి స‌పోర్ట్ అందించ‌డం చేయండి.ఒక‌వేళ మీరు స‌పోర్ట్ చేయ‌క‌పోయిన వారిని వెన‌క్కి లాగొద్దంటూ ఉపాస‌న ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. మ‌నం కొత్త నాయకుడికి సపోర్ట్ అందిస్తేనే మార్పు క‌నిపిస్తుంది.

త‌మిళనాడులో మార్పు అనేది త‌ప్ప‌క వ‌స్తుంద‌ని నేను న‌మ్ముతున్నాన‌ని ఉపాస‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఉపాస‌న చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ అంతా రాజ‌కీయాల‌లో యాక్టివ్‌గా ఉన్న‌నేప‌థ్యంలో ఉపాస‌న కూడా రాజ‌కీయాల‌లోకి వ‌స్తారా అని ప్ర‌శ్నించ‌గా, దానికి సమాధానం ఇస్తూ.. నేను రాజకీయాల్లోకి రావడం అనేది మాత్రం జరగదు. కానీ మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించే నాయకుడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని ఉపాస‌న చెప్పుకు వ‌చ్చింది. ఆమె మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉపాస‌న ఫుల్ సపోర్ట్ అందించ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక ఉపాస‌న ఆ ఇంట‌ర్వ్యూలో చరణ్.. తన కూతురు క్లీంకార మధ్య ఉన్న బాండింగ్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. చ‌ర‌ణ్ త‌న కూతురు బాండింగ్ చూసి నాకు ఒక్కోసారి జ‌ల‌స్‌గా అనిపిస్తుంద‌ని ఉపాస‌న స్ప‌ష్టం చేయ‌డం విశేషం.