మరోసారి అడ్డంగా దొరికిన రష్మిక, విజయ్ దేవరకొండ.. ఈ సారైన క్లారిటీ వచ్చినట్టేనా?

టాలీవుడ్‌లో కొన్ని జంటల గురించి సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతుంటాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ ప్రచారాలు కూడా చేస్తారు. అయితే అందులో నిజం ఎంత ఉందో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. రష్మిక, విజయ్ దేవరకొండ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాలలో మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలు కొట్టేసినా, ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, రష్మిక విజయ్ ఇంట్లో పండగలు సెలబ్రేట్ చేసుకోవడంతో అభిమానులలో అనుమానాలు బలపడుతూ వస్తున్నాయి.
రష్మిక, విజయ్ దేవరకొండ రెండు పర్యాయాలు మాల్దీవ్స్ వెళ్లారు. ఒకే గదిలో స్టే చేశారు. ఓసారి రష్మిక లైవ్ లో మాట్లాడుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దాంతో విజయ్ దేవరకొండ-రష్మిక ఒకే గదిలో ఉన్నారన్న కథనాలు కూడా బయటకు వచ్చాయి. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కూడా రష్మికకి మంచి అనుబంధం ఉందని, రీసెంట్‌గా ఆమె దీపావళి వేడుక వారి ఫ్యామిలీతోనే జరుపుకున్నారని సమాచారం. అయితే యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో రణ్‌బీర్ కపూర్… ఫ్లోలో ఓ మేటర్ లీక్ చేశాడు. అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీలో విజయ్ దేవరకొండ ఇంటి పైన సందీప్ రెడ్డి వంగ రష్మికను మొదటిసారి కలిశానని చెప్పడంతో గీతా గోవిందంకి ముందే ఈ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందని అందరు అనుకున్నారు.
అయితే విజయ్ దేవరకొండ రౌడీ వేర్ గార్మెంట్ బ్రాండ్ నడుపుతుండగా, డిసెంబర్ నుంచి రౌడీ వేర్ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అవ్వనున్నాయి. అయితే ఈ ప్రోడక్ట్స్ లాంచ్ కావడానికి ముందు రౌడీ వేర్ కి సంబంధించి ఒకే రకమైన డ్రెస్ లు రష్మిక, విజయ్ వేసుకోగా, వారికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. రష్మిక ఎయిర్ పోర్ట్ లో వెళ్తూ కనపడిన సమయంలో రౌడీవేర్ హుడీ వేసుకోవడంతో అందరు విజయ్ దేవరకొండ అని అరిసారు. దాంతో నవ్వుకుంటూ వెళ్లిపోయింది. ఇక విజయ్ దేవరకొండ ఓటు వేయడానికి వచ్చిన సమయంలో రౌడీ వేర్ హుడీనే వేసుకున్నాడు. ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకోవడంతో ఇద్దరి మధ్య ఏం నడుస్తుందని నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాట్లాడేసుకుంటున్నారు