మీ నాన్న కేసీఆరే చెప్పాడు: ఎంపీ అర‌వింద్‌

విధాత: కవితను బీజేపీలో చేరాలని మా పార్టీ వాళ్లే అడిగినట్లు కేసీఆరే చెప్పారని నిజామాబాద్‌ ఎంపీ అర‌వింద్ గుర్తుచేశారు. కేసీఆర్‌ ఇంటిపై కవిత దాడి చేస్తారా? వ్యాఖ్యలు చేస్తే దాడి చేస్తారా? ఇంటిపై దాడి చేయడం సమంజసమేనా? మా అమ్మను భయపెట్టే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవితకు అహంకారం ఎక్కువైందని మండిపడ్డారు. మీ నాన్న చెప్పినట్టే నేను చెప్పాను. మీ నాన్న ఇంటిపై అలాగే దాడి చేశావా? అని ప్రశ్నించారు. అహంకారంతోనే 70 […]

మీ నాన్న కేసీఆరే చెప్పాడు: ఎంపీ అర‌వింద్‌

విధాత: కవితను బీజేపీలో చేరాలని మా పార్టీ వాళ్లే అడిగినట్లు కేసీఆరే చెప్పారని నిజామాబాద్‌ ఎంపీ అర‌వింద్ గుర్తుచేశారు. కేసీఆర్‌ ఇంటిపై కవిత దాడి చేస్తారా? వ్యాఖ్యలు చేస్తే దాడి చేస్తారా? ఇంటిపై దాడి చేయడం సమంజసమేనా? మా అమ్మను భయపెట్టే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, కవితకు అహంకారం ఎక్కువైందని మండిపడ్డారు. మీ నాన్న చెప్పినట్టే నేను చెప్పాను. మీ నాన్న ఇంటిపై అలాగే దాడి చేశావా? అని ప్రశ్నించారు. అహంకారంతోనే 70 ఏళ్ల మా అమ్మపై దాడిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్‌ చేశారని అన్నాను. నేను కవితను తిట్టలేదు, పరుషపదాలు వాడలేదన్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఆదేశాలతోనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నా ఇంటిపై దాడిచేశారని ఎంపీ అర‌వింద్‌ ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ట్యాగ్‌ చేస్తూ.. అర‌వింద్‌ ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తన ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. మా అమ్మను బెదిరించారని ట్వీట్‌లో పేర్కొన్నారు.