Gold Rates | బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు ధరలు ఇవే..
Gold Rates | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలు.. నేడు మార్కెట్‌లో కొనసాగుతున్నది. 22 గోల్డ్ తులానికి రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడిపై రూ.80,400 వద్ద ట్రేడవుతున్నది.

Gold Rates | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలు.. నేడు మార్కెట్‌లో కొనసాగుతున్నది. 22 గోల్డ్ తులానికి రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడిపై రూ.80,400 వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.73,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.80,550 వద్ద స్థిరంగా ఉన్నది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.80,400 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్స్ బంగారం రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.80,400 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.73,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.80,400 వద్ద స్థిరంగా ఉన్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో రూ.1,06,000 వద్ద ట్రేడువుతున్నది. అయితే, ఇటీవల బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు కారణంగా పేర్కొంటున్నారు. ఈ సారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ట్రంప్, కమలా హారిస్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే బంగారం పెట్టుబడి సురక్షితంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.