70th National Film Awards | ఈసారి జాతీయ ఉత్తమనటుడెవరు.?
ఈనెలలో ప్రకటించాల్సిఉన్న జాతీయ చలనచిత్ర అవార్డులు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలు వరుసగా దక్షిణాది కథానాయకులకే ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈసారి కూడా అదే పునరావృతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

70వ జాతీయ చలనచిత్ర అవార్డు(70th National Film Awards)ల ప్రకటనకు ఇంకొద్ది రోజులే సమయం ఉంది. 2022లో సెన్సారైన(Sensored in 2022) సినిమాలకు గాను ఈసారి అవార్డులు ప్రకటిస్తారు. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో అవార్డుల ప్రకటన సంప్రదాయం. దాని ప్రకారం, ఈ నెలలో ఏ రోజైనా ప్రకటన రావచ్చు. జాతీయ ఉత్తమనటుడు(National Best Actor) అవార్డు ఏ నటుడికైనా అత్యున్నత పురస్కారం. గత మూడు ఎడిషన్లలో దక్షిణాది నటులు, ధనుష్(Dhanush), సూర్య(Suriya), అల్లు అర్జున్(Allu Arjun) ఉత్తమ నటులుగా అవార్డులు కైవసం చేసుకున్నారు. 67వ ఎడిషన్(67the Edition)లో ధనుష్ అసురన్(Asuran) చిత్రానికి గాను, 68వ ఎడిషన్‌కు సూర్య సూరారై పోట్రు(Soorarai Pottru) సినిమాకు, 69వ అవార్డులకు అల్లు అర్జున్ పుష్ప(Pushpa-The Rise) సినిమాకు అవార్డులు అందుకున్నారు. కాగా, అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడి(First Telugu Actor)గా చరిత్రకెక్కారు. ఈసారి కూడా దక్షిణాది(South films)కే ఈ అవార్డు దక్కే అవకాశముంది. ఈసారి మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి(Mammootty), కన్నడ హీరో రిషభ్ శెట్టి(Rishabh Shetty) రేసులో ఉన్నారు.
మూడుసార్లు జాతీయ అవార్డు విజేత సూపర్‌స్టార్ మమ్ముట్టి తన రెండు సినిమాలు రాషాక్(Rorschach), నాన్పకల్ నేరతు మయక్కం- Nanpakal Nerathu Mayakkam (తెలుగులో అర్థం: ఓ మధ్యాహ్నపు కలలా..)లలోని అత్యద్భుత నటనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ రెండు సినిమాలు చాలా గుర్తింపు పొందాయి. ఈ సినిమా కేరళ రాష్ట్ర 53వ చలనచిత్ర(53rd Kerala State Film Awards) అవార్డులలో ఉత్తమ చిత్రం(Best picture), ఉత్తమ నటుడు(Best Actor) విభాగాల్లో అవార్డులు గెల్చుకుంది. లిజో జోస్ పెల్లిసెరీ(Lijo Jose Pellissery) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు రమ్యాపాండ్యన్, రమ్య సువి, సంజనాదీపు తదితరులు నటించారు. సినిమా కథ జేమ్స్(James) అనే పాత్ర చుట్టూ తిరుతుంది. వేలాంగిణీ మాత ఆలయానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ మలయాళ కుటుంబంలోని పెద్ద జేమ్స్, బస్సు ఓ ఊరిలో ఆగగా, దిగి అలా నడుచుకుంటూ ఓ ఇంట్లోకి వెళ్లి ఆ ఇంటి మనిషి సుందరం(Sundaram)లా ప్రవర్తిస్తాడు. కానీ ఊరివాళ్లు మాత్రం నమ్మరు. ఇక నిజమైన కుటుంబసభ్యులు తనను తీసుకెళ్లడానికి చేసే ప్రయత్నాలు ఫలించాయా? అతను జేమ్స్‌లా తిరిగి మారాడా? సుందరంలా ఉండిపోయాడా అనేదే కథ. ఇందులో జేమ్స్‌గా మమ్ముట్టి నటన అత్యంత సహజంగా, అత్యద్భుతంగా ఉంటుంది. ఒక రకమైన సైకలాజికల్ థ్రిల్లర్(Phsycological Thriller) ఇది.
ఇక రాషాక్కు నిసామ్ బషీర్ (Nissam Basheer)దర్శకత్వం వహించగా, మమ్ముట్టి, గ్రేస్ ఆంటోనీ, ఆసిఫ్ అలీ, బిందు పనికర్ తదితరులు నటించారు. ఒక ప్రవాస భారతీయుడు(NRI) తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై పగతీర్చుకోవడానికి తయారవడమే ఇందులో కథ. ఇది కూడా జీవితంలోని సున్నిత అంశాలను స్పృశించే సైకలాజికల్ థ్రిల్లరే.
ఇక రిషభ్ శెట్టి విషయానికొస్తే, కేవలం కన్నడ సినీ పరిశ్రమకే పరిచయం ఉన్న తను కాంతార(Kantara) చిత్రంతో రాత్రికి రాత్రి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా కథ, అందులో రిషభ్ నటనకు యావత్ప్రపంచం ఫిదా అయిపోయారు. కేవలం 16 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 కోట్లు కొల్లగొట్టింది. రిషభ్ శెట్టితో పాటు, సప్తమి గౌడ, కిశోర్, మానసి సుధీర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కర్ణాటక లోని ఒక ప్రాంతంలో ఉండే భూతకోల(Bhootha Kola) అనే గ్రామీణ దైవిక వేడుకను ఆధారంగా చేసుకుని, ప్రకృతిని కాపాడటం ఈ కథలోని ముఖ్యాంశం. ఈ సినిమాకు రిషభ్ శెట్టినే దర్శకత్వం కూడా నిర్వహించాడు. ఇందులో శివ అనే పాత్రను ధరించిన రిషభ్, భూతకోలగా మారినప్పుడు ప్రదర్శించిన నటన అందరినీ భయపెడుతూ, అబ్బురపరుస్తుంది.
ఈ సినిమా విజయంతో రిషభ్ శెట్టి కాంతారకు ప్రిక్వెల్ (Prequel) మొదలుపెట్టాడు. కాంతార కథకు ముందుగా జరిగిన కథతో ఈ రెండవ సినిమా నడుస్తుంది.
ఇలా మమ్ముట్టి, రిషభ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు పోటీ పడుతూండగా, వారి వారి అభిమానులు మాత్రం మాకంటే మాకే అని వాదులాడుకుంటున్నారు. జనవరి1, 2022 నుండి డిసెంబర్ 31, 2022 తేదీల మధ్య సెన్సార్ అయిన సినిమాలనే అవార్డు పరిగణనలోకి తీసుకుంటారు. ఏదేమైనా మరోసారి సౌత్ ఇండియాకు అవార్డు ఖాయమని దక్షిణ భారతీయులు సంబరపడుతున్నారు.
Tags: