Mohan Babu Join’s Nani The Paradise | నాని సినిమాలో భయపెడుతున్న మోహన్ బాబు
నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో మోహన్ బాబు విలన్‌గా అలరించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో భయపెట్టే లుక్‌తో ఆకట్టుకున్నారు.

విధాత : సీనియర్ నటుడు మోహన్ బాబు నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తుండటంతో ఈ మూవీ క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ‘దసరా’ మూవీ కాంబో నాని- శ్రీకాంత్ ఓదెలదర్శకత్వంలో రాబోతున్న ది ప్యారడైజ్’ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జాయిన్ అయినట్లు నాని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో ‘శికంజ మాలిక్’ పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారని..‘‘గొప్ప హీరోలు ఉన్నారు… గొప్ప విలన్లు ఉన్నారు. దానిని మోహన్ బాబు మరోసారి గుర్తు చేయడానికి మీ ముందుకు రాబోతున్నారు’’ అనే క్యాప్షన్ జత చేశారు. మోహన్ బాబు పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
పోస్టర్ లో మోహన్ బాబు షర్ట్ లేకుండా గన్, కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ చేతులపై రక్తం కారుతుండగా..భయపెట్టే లుక్‌లో కనిపించి అందరికీ షాకిచ్చాడు. మోహన్ బాబు లుక్ చూసిన నెటిజన్లు కలెక్షన్ కింగ్ లుక్ అదిరింది బాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని ‘జడల్’ పాత్రలో ఢిఫిరెంట్ లుక్ తో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో మూవీ నిర్మిస్తున్నారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న ఏకంగా 8 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.