బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత ఆ రేంజ్ విజ‌యం సాధించ‌లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల‌తో వ‌రుస ఫ్లాపులు అందుకున్నాడు. అయితే ఇటీవ‌ల స‌లార్ చిత్రం భారీ విజ‌యాన్ని అందుకొని తిరిగి ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇన్నాళ్లు అభిమానులు ప్ర‌భాస్ నుండి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో స‌లార్‌లో అది చూసి ఫుల్ ఖుష్ అయిపోయారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ నుండి రెండు సినిమాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.అందులో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రాజా సాబ్ ఒక‌టి కాగా, నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న క‌ల్కి. ఈ రెండు చిత్రాల‌తో ప్ర‌భాస్ త‌న అభిమానుల‌కి కావ‌ల్సినంత వినోదం పంచ‌నున్నాడ‌ని అర్ధ‌మ‌వుతుంది.

ఇక ఇదిలా ఉంటే ప్ర‌భాస్ .. యానిమల్‌ వంటి బోల్డ్ మూవీతో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన‌ సందీప్‌ రెడ్డి వంగాతో తో సినిమా చేయబోతున్నారు. స్పిరిట్‌ పేరుతో ఈ మూవీ రూపొందుతుంద‌ని, ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది. యానిమ‌ల్ మూవీ స‌క్సెస్ త‌ర్వాత సందీప్ స్పిరిట్ చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టారు. యానిమ‌ల్‌లో ర‌ణ్‌బీర్‌ని ఓ రేంజ్‌లో చూపించిన సందీప్.. స్పిరిట్‌లో ప్ర‌భాస్‌ని ఓ రేంజ్‌లో చూపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. స్పిరిట్ ఈ మూవీ పోలీస్‌ స్టోరీగా చాలా రోజులుగా వినిపిస్తుంది. అయితే సినిమాలో ప్రభాస్‌ పోలీస్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని టాక్

ప్ర‌భాస్ క్యారెక్ట‌రైజేష‌న్ ఆధారంగానే సినిమా సాగుతుంద‌ని, ప్రభాస్‌ని ఓ మ్యాడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ద‌ర్శ‌కుడు చూపించబోతున్నారట. ఇందులో ప్ర‌భాస్ పాత్ర చాలా సిన్సియర్‌గా, నిజాయితీగా ఉంటాడని, అదే సమయంలో చాలా యారగెంట్‌గా కూడా ఉంటాడ‌ని ఓ టాక్ వినిపిస్తుంది. పోలీస్ ఆఫీస‌ర్‌గా ప్ర‌భాస్ చేసే ర‌చ్చ ఫ్యాన్స్‌కి మాత్రం మాంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డం ఖాయంగా తెలుస్తుంది.గ‌తంలో ఎప్పుడు చూడ‌ని పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తాడ‌ని, ప్ర‌భాస్ పాత్ర నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్టుగా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ అక్టోబర్‌లో షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని సమాచారం. మ్యాగ్జిమమ్‌ అక్టోబర్‌ లేదంటే నవంబర్‌లో ఎలాగైనా సెట్స్ మీదకు తీసుకుపోవాలనుకుంటున్నారట. 2025లో స్పిరిట్ విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తుండ‌గా, 2026లో స‌లార్‌2తో అల‌రించ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

sn

sn

Next Story