కామాంద కానిస్టేబుల్
విధాత: బాధితులకు రక్షణ కల్పించి అండగా నిలవాల్సిన కానిస్టేబులే కాటేశాడు. ఆలస్యంగా వెలుగు చేసిన ఈ ఘటన పోలీసు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీ రమేశ్ 2019లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. గుంటూరులోని కొత్తపేట పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబంతోపాటు ఓ ఇంట్లో పై అంతస్థులో అద్దెకు ఉంటున్నాడు. కింది పోర్షన్‌లో ఓ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుటుంబం ఉంటోంది. పదోతరగతి చదువుతున్న ఆమె కుమార్తెతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ […]

విధాత: బాధితులకు రక్షణ కల్పించి అండగా నిలవాల్సిన కానిస్టేబులే కాటేశాడు. ఆలస్యంగా వెలుగు చేసిన ఈ ఘటన పోలీసు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీ రమేశ్ 2019లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. గుంటూరులోని కొత్తపేట పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబంతోపాటు ఓ ఇంట్లో పై అంతస్థులో అద్దెకు ఉంటున్నాడు. కింది పోర్షన్‌లో ఓ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుటుంబం ఉంటోంది. పదోతరగతి చదువుతున్న ఆమె కుమార్తెతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ చనువుగా వ్యవహరిస్తున్నాడు. తరచూ బాలికతో మాట్లాడేందుకు రమేశ్ ప్రయత్నిస్తుండటంతో ఆమె కుటుంబం. తమ కుమార్తెతో మాట్లాడవద్దని హెచ్చరించింది.
రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. కానిస్టేబుల్ ఆ బాలికను పిలిపించాడు. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండగా, గమనించిన బాలిక కుటుంబ సభ్యులు కానిస్టేబుల్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం దిశ స్టేషన్‌లో రమేశ్‌ను అప్పగించి ఫిర్యాదుచేశారు. కాగా, కానిస్టేబుల్ రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ.. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఉత్తర్వులు జారీచేశారు.