Woman Nose | శృంగారానికి అంగీకరించలేదని.. యువతి ముక్కు కోసిన మానవ మృగాలు.. వీడియో
Woman Nose | ఓ నలుగురు యువకులు క్రూర మృగాల్లా ప్రవర్తించారు. యువతి తమతో శృంగారానికి అంగీకరించలేదని చెప్పి.. ఆమె ముక్కును కత్తితో కోసి పైశాచిక ఆనందం పొందారు. ఈ క్రూరమైన ఘటన ఏడు నెలల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. యువతి ముక్కు కోసిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్( Pakistan )లోని డేరా ఘాజీ ఖాన్( Dera Ghazi Khan)కు చెందిన ఓ నలుగురు యువకులు కలిసి ఓ యువతిని నిర్బంధించారు. తమతో శృంగారంలో పాల్గొనాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఆ యువతి వారి ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో ఆ నలుగురు క్రూర మృగాలా మాదిరి ప్రవర్తించారు. యువతి కాళ్లు, చేతులను కట్టేశారు. ఆ తర్వాత పదునైన కత్తితో ఆమె ముక్కును కోసేశారు. అనంతరం పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనను తమ సెల్‌ఫోన్లలో బంధించారు.
అయితే ఈ ఘటన ఏడు నెలల క్రితం చోటు చేసుకోగా, ఈ నెల 7వ తేదీన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై పాకిస్తాన్ హ్యుమన్ రైట్స్ కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. బాధితురాలి సోదరుడు సహరణ్ బీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Graphic Warning: Incident that unfolded in Dera Ghazi Khan, a group of Muslims, kidnapped a woman named Shahrian Mai.The motive behind this heinous act was her refusal to engage in a friendship and sexual relationship with a man named Zafar Lashairi. The video footage, which is… pic.twitter.com/O2us9OK9k1
— Faraz Pervaiz (@FarazPervaiz3) July 9, 2024