Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు శుభ‌యోగాలు..!

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు శుభ‌యోగాలు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కోసం చేసే అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు భాగస్వాముల ద్వారా ఆర్థికలబ్ధి పొందుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. సహనం వహించండి. అనుకోని ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంది. ఇష్టమైన వారిని కలుసుకుంటారు. అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర చర్చల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే పనులు చేయకండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన సుఖసంతోషాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి శుభప్రదమైన రోజు. వ్యాపారులు ఆర్థికపరంగా లాభపడవచ్చు. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు చక్కగా నిర్వహించుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వృత్తి పరంగా చేసే ప్రయాణాలు అనుకూలం. పిత్రార్జితం కలిసి వస్తుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి మంచి సమయం. ఆర్థిక ప్రణాళికలు అమలు చేయడానికి అనువైన రోజు. ఖర్చుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా రోజంతా కొన్ని ఇబ్బందులు ఒత్తిడి వుండే అవకాశం వుంది. కోపావేశాలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అవమానకర సందర్బాలను తప్పించుకోడానికి మౌనంగా వుండడం మంచిది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి శుభ సమయం. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.