మ‌ధుమేహులు ఆరోగ్య బీమా పొంద‌వ‌చ్చా..?

విధాత‌: డయాబెటిస్ కుటుంబం మీద భారంగా మారే ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. డయాబెటిస్ మాత్రమే కాదు దానికి అనుబంధంగా రకరకాల సమస్యలు రావచ్చు. వీటన్నింటికి చికిత్స అంటే అది కాస్త ఖ‌ర్చుతో కూడుకున్న వ్యవహారమే అవుతుంది. ఈ రోజుల్లో హాస్పటల్‌కి వెళ్లడం అంటేనే అధిక ఖ‌ర్చు అని అర్థం. ఒకసారి హాస్పిటల్ పాలైతే ఎంత డబ్బు ఖ‌ర్చవుతుందనేది అంచనాలకు అందకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆపన్న హస్తం హెల్త్ ఇన్సూరెన్స్. మరి డయాబెటిక్ పేషెంట్లకు బీమా పాలసి దొరకుకుతుందా? […]

మ‌ధుమేహులు ఆరోగ్య బీమా పొంద‌వ‌చ్చా..?

విధాత‌: డయాబెటిస్ కుటుంబం మీద భారంగా మారే ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. డయాబెటిస్ మాత్రమే కాదు దానికి అనుబంధంగా రకరకాల సమస్యలు రావచ్చు. వీటన్నింటికి చికిత్స అంటే అది కాస్త ఖ‌ర్చుతో కూడుకున్న వ్యవహారమే అవుతుంది.

ఈ రోజుల్లో హాస్పటల్‌కి వెళ్లడం అంటేనే అధిక ఖ‌ర్చు అని అర్థం. ఒకసారి హాస్పిటల్ పాలైతే ఎంత డబ్బు ఖ‌ర్చవుతుందనేది అంచనాలకు అందకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆపన్న హస్తం హెల్త్ ఇన్సూరెన్స్. మరి డయాబెటిక్ పేషెంట్లకు బీమా పాలసి దొరకుకుతుందా? ఎలాంటి కండిన్స్ ఉంటాయి వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్ర‌పంచంలో 422 మిలియ‌న్ల డ‌యాబెటిక్‌లు

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులు ఉండగా సంవత్సరానికి 1.5 మిలియన్ల మంది డయాబెటిస్ దాని సంబంధ సమస్యలతో మరణిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతోంది. ఇప్పుడు డయాబెటిస్ చాలా సాధరణం అయిపోయిందని ఈ లెక్కలను బట్టి అర్థం అవుతోంది. సాధారణం అయినంత మాత్రాన ఈజీగా తీసుకునే విషయం మాత్రం కాదు. నిర్లక్ష్యం అసలు చేయ‌కూడదు.

మన దేశంలో డయాబెటిస్ చాలా వేగంగా పెరుగుతోంది. ఎంత వేగంగా పెరుగుతోందంటే మన దేశాన్ని డయాబెటిస్ కు ప్రపంచ రాజధానిగా పరిగణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల్లో ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 8.7 శాతం డయాబెటిక్ రోగుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందట. వీళ్లలో అందరూ కూడా 20 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్కులు.

సమాజం మీద, వైద్య రంగం మీద డయాబెటిస్ పెద్ద భారంగా మారుతోంది. అందుకే కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, ప్రభుత్వం, వైద్యరంగం కలిసి కట్టుగా ఈ సమస్య గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అవగాహన కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఉంది.

బీమా దొరుకుతుందా?

కచ్చితంగా దొరకుతుంది. కానీ ప్రతి ఏటా ప్రీమియం కాస్త ఎక్కువ కట్టించుకుంటారు. డయాబెటిస్ దాని అనుబంధంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కవరేజి ఉంటుంది. ఒక్కోసారి పాలసీ ప్రారంభించిన తర్వాత కూడా వ్యాధి నిర్ధారణ కావచ్చు, అలాంటి సందర్భాలను మిన‌హాయిస్తే పాలసీ కొనడానికి ముందే డయాబెటిస్ బారిన పడిన వారు పాలసీ తీసుకోవాలనుకుంటే మాత్రం పాలసీ కన్ఫామ్‌ చెయ్యడానికి కాస్త స‌మ‌యం వేచి ఉండాల్సి వ‌స్తుంద‌ని ఎడ్విసిప్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పూజా యాదవ్ వివరించారు.

ఆరోగ్య బీమా అవసరమా?

నిజానికి డయాబెటిస్‌ను మేనేజ్ చెయ్యడానికి కచ్చితంగా ఎక్కువే ఖ‌ర్చవుతుంది. ఫలితంగా కుటుంబ ఫైనాన్షియల్స్ మీద గ‌ట్టి ప్రభావమే ఉంటోంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలా పాలసీలు హాస్పిటల్స్‌లో చేరినపుడు మాత్రమే వర్తించేట్టుగా నిబంధనలు ఉంటాయి. అంతకు ముందు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండే డే కేర్, హాస్పిటల్ కేర్ ట్రీట్మెంట్లతో పాటు డయాలసిస్ ఖ‌ర్చుల వంటి వాటన్నింటిని కవర్ చేసే పాలసీని ఎంచుకోవాలని డైరెక్టర్, హెడ్ రిటైల్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కు చెందిన అజయ్ షా సూచిస్తున్నారు.

ప్రీమియం ఎంత ప్రియం?

ప్రీమియం కవరేజీలో వచ్చే సదుపాయాలు, బీమా మొత్తం విలువ, బీమా చేసిన వ్యక్తి వయసు, అతని హెల్త్ హిస్టరీ ఇలా చాలా అంశాల ఆధారంగా ప్రీమియం విలువ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులతో పోల్చినపుడు డయాబెటిక్స్ కు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందనే బీమా కంపెనీలు అంచనా వేస్తాయి. వీరికి హాస్పిటల్‌లో చేరే అవసరం ఎక్కువ సార్లు వస్తుందని అభిప్రాయప‌డతారు.

అందువల్ల వీరికి 15-30 శాతం వరకు ప్రీమియం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండే డయాబెటిక్ కానీ వ్యక్తికి భీమా పాలసి 10 వేల నుంచి 12 వేల మధ్య దొరకుతుంది. 10 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఒకవేళ ప్రధాన పాలసీదారు డయాబెటిక్ అయితే మాత్రం అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రీమియం 10-20 శాతం వరకు పెరగవచ్చు.