ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుతున్నారా?.. కాస్తా ఈ విషయాలు తెలుసుకోండి!
విధాత: ఈ రోజుల్లో వంటకు ఉపయోగిస్తున్న పాత్రలు ఏ మెటల్‌తో తయారు చేసినవి వాడుతున్నారు? అందరి ఇళ్లలోనూ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు సర్వ సాధారణం అయిపోయాయి. అందులో ఉపయోగించే పాత్ర తప్పకుండా అల్యూమినియంతో చేసిందే అయి ఉంటుంది. ఒకసారి మీ వంట గదిని పరిశీలించండి. అయితే అల్యూమినియం లేదా అల్యూమినియం మీద నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న పాత్రలు వాడుతూ ఉండి ఉంటారు. మీకు తెలుసా? అల్యూమినియం పాత్రలు వంటకు ఉపయోగిస్తే మంచిది కాదని. దీర్ఘ కాలం […]

విధాత: ఈ రోజుల్లో వంటకు ఉపయోగిస్తున్న పాత్రలు ఏ మెటల్‌తో తయారు చేసినవి వాడుతున్నారు? అందరి ఇళ్లలోనూ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు సర్వ సాధారణం అయిపోయాయి. అందులో ఉపయోగించే పాత్ర తప్పకుండా అల్యూమినియంతో చేసిందే అయి ఉంటుంది. ఒకసారి మీ వంట గదిని పరిశీలించండి.
అయితే అల్యూమినియం లేదా అల్యూమినియం మీద నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న పాత్రలు వాడుతూ ఉండి ఉంటారు. మీకు తెలుసా? అల్యూమినియం పాత్రలు వంటకు ఉపయోగిస్తే మంచిది కాదని. దీర్ఘ కాలం పాటు అల్యూమినియం పాత్రలో చేసిన వంట తింటే అనారోగ్యాలు కలుగుతాయని. అందుకు నిదర్శనంగా నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. కొంతమంది పిల్లల్లో డయేరియా ఎంతకూ తగ్గడం లేదు. రకరకాల విధానాల్లో చికిత్సలు అందించినా ఫలితం కనిపించ లేదు. అప్పుడు ప్రభుత్వం ఆ గ్రామంలో ఏం జరుగుతోందో తెలుసుకుని సరైన పరిష్కారం సూచించాల్సిం దని కొంతమంది సైంటిస్టులను ఆ ఊరికి పంపించారు. అన్నీ పరిశీలించిన వారికి పెద్ద లోపాలేమీ కనిపించలేదు. ఇక వంటకు ఉపయోగించే పాత్రలను పరీక్షకు పంపించారు. అక్కడి సమస్యకు కారణం వాళ్లు తినే భోజనం కాదు వాళ్లు వంటకు ఉపయోగిస్తున్న అల్యూమినియం పాత్రలని నిర్ధారణ అయ్యింది.
ఈ అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారం విషంతో సమానం అన్నారు సైంటిస్టులు. అది ఆరోగ్యం మీద ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొద్ది కొద్దిగా ఆరోగ్యాన్ని క్షీణింప జేసే స్లో పాయిజన్ లాంటిది. ముఖ్యంగా చింతపండు వంటి పుల్లని పదార్థాలను అల్యూమీనిమం పాత్రల్లో వండ అసలు వండకూడదు. మనం భోజనం తయారు చెయ్యడానికి ఉపయోగించే పదార్థాలను అల్యూమినియం పాత్రలో వేడి చేసినపుడు పదార్థాల్లో ఉండే ఆసిడ్స్ అల్యూమినియంతో కెమికల్ రియాక్షన్ వల్ల టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి.
ఈ టాక్సిన్స్ వల్ల ముఖ్యంగా చర్మ సంబంధ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు బాడీలో పదేపదే పెరిగే ఇరిటేషన్ లేదా ఇన్ ప్లమేషన్ కారణంగా క్యాన్సర్ కూడా కారణం కావచ్చ. ఈ సమస్యలకు సులభమైన పరిష్కారం వంటింట్లో వంట పాత్రలు మార్చెయ్యడమే.
వెనుకటి రోజుల్లో అన్నం వండేందుకు తప్పనిసరిగా ఇత్తడి గిన్నెను మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పటికీ కొంతమంది బామ్మలు, అమ్మమ్మలు ఇత్తడి గిన్నెలో వండిన అన్నమే తింటామని అంటారు. ఇత్తడి లేదా మట్టి పాత్రలను వంటకు వాడుకోవడం అన్నింటి కంటే ఉత్తమమైన మార్గం. కొన్ని రకాల వంటలకు ఇనుప పాత్రలను వాడినా మంచిదే. ఇనుప మూకుడులో వండిన వంట ఐరన్ రిచ్డ్ గా ఉంటుంది.
మట్టి పాత్రలో వండిన ఆహారం త్వరగా చెడిపోదు. పాలు, పెరుగు నిలువ చెయ్యడానికి పింగాణీ లేదా మట్టి పాత్రలు వాడడం వల్ల త్వరగా చెడిపోవు. ఇత్తడి పాత్రలో వండిన అన్నం కూడా త్వరగా చెడిపోదు. ఇత్తడి పాత్రలోపలి భాగంలో టిన్ తో కోటింగ్ చేయడాన్ని కలాయి అంటారు. అలాంటి పాత్రలు వంటకు వాడడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పూర్వపు రోజుల్లో అల్యూమినియం వాడకం చాలా తక్కువగా ఉండేది. అదే వారి అరోగ్య రహస్యం. భాండ శుద్ధి లేని పాకమేలా అని అన్నారు మరి.