Snake soup | మీకు వెజ్‌, నాన్‌వెజ్‌ సూప్‌లు అన్నీ తెలుసు.. మరి స్నేక్‌ సూప్‌ గురించి తెలుసా..?

Snake soup : సాధారణంగా పామును చూస్తేనే జనం ఆమడ దూరం పరుగులు పెడుతారు. కానీ చైనాలో మాత్రం శీతాకాలం వస్తే పాములను చంపి సూప్‌ చేసుకుని మరీ తాగుతారు. కార్న్‌ సూప్‌, చికెన్‌ సూప్‌, మటన్‌ సూప్‌ గురించి విన్నాం గానీ.. ఈ స్నేక్‌ సూప్‌ ఏందీ విచిత్రంగా అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. చైనీయులు శీతాకాలంలో పాములను సూప్‌ చేసుకుని తాగుతారు. మరి ఎందుకో తెలుసా..? తెలియదంటారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం..

కొద్ది కాలం క్రితం పిజ్జా హట్‌, సెర్ వాంగ్ ఫన్ అనే స్నేక్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ కలిసి హాంకాంగ్‌లో స్నేక్-సూప్ పిజ్జా అనే కొత్త వంటకాన్ని సృష్టించాయి. ఈ వంటకం చైనా అంతటా చర్చనీయాంశమైంది. స్నేక్‌ సూప్‌ పిజ్జా అంటే.. పిజ్జాతోపాటు ఒక కప్పులో స్నేక్‌ సూప్‌ ఇస్తారు. అయితే ఈ కాంబినేషన్‌ మంచిదేనా.. ఆరోగ్యానికి సురక్షితమేనా..? అనే అనుమానాలు తలెత్తాయి. ఆఖరికి ఆరోగ్యానికి మంచితే అని తేలడంతో దీన్ని అక్కడి ప్రజలు విపరీతంగా ఆస్వాదిస్తున్నారు.

స్నేక్‌ సూప్ కొత్త వంటకం కాదుS

ఈ స్నేక్‌ సూప్‌ కొత్త వంటకం కాదట. పురాతన కాలం నుంచే చైనా వంటకాల్లో స్నేక్‌ సూప్‌ ప్రధాన వంటకంగా ఉన్నదట. అయితే ఇప్పుడు పిజ్జాతో జతగా తీసుకొచ్చిన స్నేక్‌ సూప్‌ పిజ్జా అనేది కొత్త కాంబినేషన్. కాంటోనీస్ వంటకం అయిన స్నేక్‌ సూప్‌ చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో స్నేక్‌ సూప్ రుచిగా, మంచి వాసనతో ఉంటుందని ఆ వంటకం నిపుణులు చెబుతున్నారు. అందుకే చైనాలో ఈ స్నేక్‌ సూప్‌ను ఎక్కువగా శీతాకాలంలోనే ఆస్వాదిస్తారని తెలిపారు. దక్షిణ చైనాలో రెండు వేల ఏండ్ల క్రితమే స్నేక్‌ సూప్ వంటకాల్లో భాగంగా ఉందని అన్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు..

ఈ స్నేక్‌ సూప్‌తో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయట. విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని, నిద్రను మెరుగుపరుస్తుందని, క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుందని స్నేక్‌ సూప్‌ స్పెషలిస్టులు చెబుతున్నారు. ప్రొటీన్‌లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఈ వంటకం జీర్ణశక్తిని పెంచడానికి, శరీరంలోని విషాలను తొలగించడానికి కూడా తోడ్పడుతుందని అంటున్నారు. ఈ స్నేక్‌ సూప్‌కు సంబంధించిన మూల పదార్థాలను 12 గంటలకు పైగా ఉడికించి.. ఆ తర్వాత వాటికి పాము మాంసం ముక్కలు, అల్లం కలుపుతారని తెలిపారు. విష రహిత పాములతోపాటు, విష సర్పాలను కూడా ఈ సూప్‌ తయారీకి వినియోగిస్తారని చెప్పారు.