Health tips | ఈ రోజుల్లో ఉరుకులు, పరుగుల జీవనం కారణంగా ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంలేదు. ఎప్పుడూ పని, సంపాదన గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇలా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే మన శరీరంలో పేరుకుపోయే సైలెంట్ కిల్లర్ అకస్మాత్తుగా ప్రాణాలు తీస్తుందనే విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఆ సైలెంట్ కిల్లర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Health tips : ఈ రోజుల్లో ఉరుకులు, పరుగుల జీవనం కారణంగా ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంలేదు. ఎప్పుడూ పని, సంపాదన గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇలా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే మన శరీరంలో పేరుకుపోయే సైలెంట్ కిల్లర్ అకస్మాత్తుగా ప్రాణాలు తీస్తుందనే విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఆ సైలెంట్ కిల్లర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనలో శక్తి కోసం కొవ్వు అవసరం. ఈ కొవ్వు కరగడం ద్వారా శక్తి ఉత్పత్తవుతుంది. అయితే కొవ్వులో రెండు రకాలుగా ఉంటుంది. అది చెడు కొవ్వు, మంచి కొవ్వు. వైద్య పరిభాషలో చెడు కొవ్వుని LDL అని, మంచి కొవ్వుని HDL అంటారు. శరీరంలో చెడుకొవ్వు పెరిగితే గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఆకస్మిక మరణం సంభవిస్తుంది.
ఈ మంచి, చెడు కొవ్వులకు తోడు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అసాధారణంగా పెరిగిపోయే స్థితినే డైస్లిపిడెమియా అంటారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఈ హై కొలెస్ట్రాల్ని సాధారణంగా గుర్తించలేము. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తేనే కొవ్వు స్థాయిలు బయటపడుతాయి.
అందుకే వైద్యులు మనలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ సంవత్సరానికి ఓ సారి అయినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తుంటారు. కాగా మన దేశంలో మొదటిసారి లిపిడ్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. దీనికి అనుగుణంగా ఈ సైలెంట్ కిల్లర్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేశారు.