పానీ పూరీ తింటున్నారా? కాస్త ఈ విషయాలు తెలుసుకోండి

విధాత: పానీ పూరి, గొల్గప్ప అని మాట వినిపిస్తే చాలు నోరూరని వారు ఎవరూ ఉండరంటే అది అబద్ధం కాదు. ప్రతి వాళ్లు పానీపూరి అనగానే తినడానికి రెడీ అయిపోతారు. అందుకే పానీపూరి బండి ఎక్కుడున్నా ఖాళీగా కనిపించదు. చుట్టూ ఈగల్లా జనం మూగే ఉంటారు. ఇక అమ్మాయిల విషయం చెప్పే పనిలేదు. పని పూరీ ఇప్పిస్తానంటే ఏదైనా చేసేస్తారు. భయ్యా మీఠాకే సాథ్ ఏక్ ఎక్స్ ట్రా అనే ట్రోలింగ్స్ కూడా పాపులర్ అయ్యాయంటే అర్థం […]

  • By: krs    health    Nov 29, 2022 2:46 AM IST
పానీ పూరీ తింటున్నారా? కాస్త ఈ విషయాలు తెలుసుకోండి

విధాత: పానీ పూరి, గొల్గప్ప అని మాట వినిపిస్తే చాలు నోరూరని వారు ఎవరూ ఉండరంటే అది అబద్ధం కాదు. ప్రతి వాళ్లు పానీపూరి అనగానే తినడానికి రెడీ అయిపోతారు. అందుకే పానీపూరి బండి ఎక్కుడున్నా ఖాళీగా కనిపించదు. చుట్టూ ఈగల్లా జనం మూగే ఉంటారు. ఇక అమ్మాయిల విషయం చెప్పే పనిలేదు. పని పూరీ ఇప్పిస్తానంటే ఏదైనా చేసేస్తారు. భయ్యా మీఠాకే సాథ్ ఏక్ ఎక్స్ ట్రా అనే ట్రోలింగ్స్ కూడా పాపులర్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. పానీపూరీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో. తినే సమయంలో ఎన్నితింటున్నామో తోచదు కానీ తిన్నాకే మన అదృష్టం బాలేకపోతే హాస్పిటళ్లే దిక్కు.

ఎలా తయారవుతుందో తెలుసా?

పానీ పూరీ తయారిలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలు మైదా పిండి, బేకింగ్ సోడా. ఇవి ఎక్కువ సార్లు తీసుకుంటే కచ్చితంగా బరువు పెరుగుతారు. మైదా ఎన్నో రకాల అనారోగ్యాలకు ప్రత్యక్ష కారణం అని నిపుణులు ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. తరచుగా పానీ పూరీ తినేవారు తప్పనిసరిగా డయాబెటిస్ బారిన పడతారు. ఎలాంటి నూనె వీటిని వేయించేందుకు వాడుతారో ఎవరికీ తెలీదు.

అందరూ బజారులో రెడీమేడ్ గా దొరికే పూరీలనే కొని తెస్తుంటారు. అంతేకాదు ఎక్కువ సార్లు మరిగించిన నూనె వల్ల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఈ నూనె వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు కూడా కారణం కాగలదు. అసలు పానీపూరీ తయారీయే అనారోగ్యకరంగా ఉంటుంది. ఏమాత్రం పోషకాలు లేని పూర్తి స్థాయి జంక్ ఫూడ్ పానీపూరీ. అంతేకాదు దీనికి ఉపయోగించే పానీ తయారీలో పాన్ మసాలా వంటి ప్రమాదకర పదార్థాలు వాడుతారు. తరచుగా తింటే క్యాన్సర్ కు కారణం కావచ్చు.

ఇన్ఫెక్షన్ల సంగతి చెప్పనవసరం లేదు

పానీపూరీ అమ్మే చోటు శుభ్రంగా ఉండదు. పరసరాల్లో శుభ్రత ఉండక పోవడంతో రకరకాల సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు ఆస్కారం చాలా ఎక్కువ. పానీపూరీ తయారు చేసి ఇచ్చే వ్యక్తి ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగి ఉంటే ఇక తప్పనిసరిగా ఆ పానీపూరీ పానీయం కలుషితం అయ్యే ఉంటుంది. ఈ పానీలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. సోడియం వల్ల శరీరంలో వాటర్ రిటైన్ అవుతుంది. అందువల్ల బరువు పెరుగుతారు, కిడ్నీలు ఎక్కువ పనిచెయ్యాల్సి వస్తుంది. అది కూడా ప్రమాదకరమే.

వర్షా కాలంలో తెలంగాణలో టైఫాయిడ్ ప్రబలడానికి కారణం పానీ పూరీ అనే అభిప్రాయానికి ప్రభుత్వం కూడా వచ్చింది. అందుకే టైఫాయిడ్‌ను ఏకంగా పానీ పూరీ రోగం అని కూడా సంబోధించారు. పానీ పూరితో డయేరియా సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ పానీపూరీ తింటే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. లివర్ మీద ప్రభావం పడి జాండీస్‌కు కారణం కూడా అవుతుంది.

జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో సమస్యలకు పానీ పూరి కారణం అవుతుంది. పీహెచ్ బ్యాలెన్స్ తప్పడం వల్ల కడుపులో అసిడిటి పెరుగుతుంది, అసిడిటి ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రేవులలో అల్సర్లకు దారి తియ్యవచ్చు కూడా.

ఇలా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు పానీ పూరీ కారణం అవుతుంది. వీలైనంత వరకు పానీ పూరీ కి దూరంగా ఉండడమే మంచిది. రుచి బావుందనో, చవకగా దొరకుతుందనో పానీ పూరీ తింటూ పోతే ఆరోగ్యానికి తిలోదకాలు ఇవ్వటమే అవుతుంది. కనుక పానీపూరీ విషయంలో జాగ్రత్త అవసరంమని నిపుణులు సూచిస్తున్నారు.