మార్నింగ్ వాక్ వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
మానవుడు ఆదునీకతవైపు పరుగు తీస్తున్నప్పటి నుంచి శారిరక శ్రమకు దూరమైతూ వస్తున్నాడు. దీంతో అనేక అనారోగ్య సమస్యల భారీన పడుతున్నాడు

విధాత: మానవుడు ఆదునీకతవైపు పరుగు తీస్తున్నప్పటి నుంచి శారిరక శ్రమకు దూరమైతూ వస్తున్నాడు. దీంతో అనేక అనారోగ్య సమస్యల భారీన పడుతున్నాడు. ప్రస్థుత జీవన శైలిలో కుర్చికి పరిమితమైన వృత్తి రిత్యా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. దీని మూలంగా స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు వంటి రోగాల భారిన పడుతున్నాడు. ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్ తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉదయాన్నే వాకింగ్ చేస్తే చాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.
ప్రతి రోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయట పడవచ్చు. బరువు తగ్గడం, అధిక క్యాలరీలు తగ్గడం, రక్త ప్రసరణ సజావుగా జరగడం, జీర్ణక్రియ శక్తిపెరగడమే కాకుండా రోజంతా చురుకుగా ఉంటామంటున్నారు. ఇది మాత్రమే కాకుండా మానసిక స్థితిని స్థిరంగా ఉంచి డిప్రెషన్ తొలగిస్తుంది. ఉదయాన్నే నడవడం మూలంగా నిద్రలో నాణ్యత మెరుగు పడుతుంది. అలాగే కండరాలు, ఎముకలు గట్టి పడతాయి. మొత్తానికి నడవడం మూలంగా ఇన్ని లాభాలు ఉన్నాయన్న మాట. కాబట్టి అందరూ ప్రతి రోజు ఉదయాన్నే నడవడం అలవాటు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చనని నిపుణులు అంటున్నారు.