అరటితో ఆరోగ్యం.. పండు.. పువ్వు.. కాండం ఏదైనా..
విధాత: అరటి చెట్టు కల్పవృక్షం లాంటిది. అలంకరణ నుంచి ఆహారం వరకు ఎన్నోరకాలుగా ఉపయోగపడే చెట్టు అరటి. ఆరటి చెట్టు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఏదో ఒకరకంగా ఉపయోగపడతాయి. కాండం, పువ్వు, కాయ, పండు మంచి పోషకాహారాలు కాగా అరటి దూట నుంచి తీసిన నారతో వస్త్రాలు తయారు చేస్తున్నారు. రకరకాల హ్యాండీ క్రాప్ట్స్ కూడా తయారు చేస్తారు. అరటి ఆకు ప్రాశస్త్యం గురించి చెప్పే పనిలేదు. మనదేశంలో అన్ని చోట్లా అరటి సాగు ఉంటుంది […]

విధాత: అరటి చెట్టు కల్పవృక్షం లాంటిది. అలంకరణ నుంచి ఆహారం వరకు ఎన్నోరకాలుగా ఉపయోగపడే చెట్టు అరటి. ఆరటి చెట్టు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఏదో ఒకరకంగా ఉపయోగపడతాయి. కాండం, పువ్వు, కాయ, పండు మంచి పోషకాహారాలు కాగా అరటి దూట నుంచి తీసిన నారతో వస్త్రాలు తయారు చేస్తున్నారు.
రకరకాల హ్యాండీ క్రాప్ట్స్ కూడా తయారు చేస్తారు. అరటి ఆకు ప్రాశస్త్యం గురించి చెప్పే పనిలేదు. మనదేశంలో అన్ని చోట్లా అరటి సాగు ఉంటుంది కనుక విరివిగా దొరుకుతుంది కూడా. మరి చవకగా కూడా దొరికే అరటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
ఫలాలు
అరటి అనగానే గుర్తొచ్చేది పండే. దీనిని కదళీ ఫలం అని వేదంలో చెబుతారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ఫలంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు పని చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది.
విటమిన్ బి6, విటమిన్ సి లభిస్తాయి. ఆహారం నుంచి ఐరన్ గ్రహించేందుకు అరటి దోహదం చేస్తుంది. రక్తం, గుండె ఆరోగ్యానికి మంచిది. గర్భిణులకు చాలా మంచిది. దీనిలో ఉండే పొటాషియం కొలేస్ట్రాల్, బీపి అదుపులో ఉంచుతుంది. కడుపులో అల్సర్లు రాకుండా కాపాడుతుంది.
అరటి పువ్వు
అరటి పువ్వు కాస్త కనరు రుచిలో ఉంటుంది. రక్తంలో చక్కెరల స్థాయిని నియంత్రిస్తుంది. ఈ పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. యాంటీ ఏజింగ్ కూడా. విటమిన్లు, అమైనా ఆమ్లాలతో చక్కటి పౌష్టికాహారం. అంతేకాదు కేలరీలు కూడా తక్కువ. బాడీ మెటబాలిజంను క్రమబద్ధీకరిస్తుంది కూడా. ఇది లైంగిక అవయవాల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు పాలిచ్చే తల్లులకు సూపర్ ఫూడ్. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
అరటి కాండం
అరటి కాండాన్ని అరటి దూట అంటారు. ఫైబర్ ఎక్కువగా ఉండే దీన్ని కూరగా తినడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు, చక్కెరల విడుదలను నియంత్రిస్తుంది. అరటి కాండం నుంచి తీసిన రసం తీసుకుంటే శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయి.
ప్రతి రోజు ఒక గ్లాసు అరటి కాండం రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగం వల్ల మూత్రపిండాలలో రాళ్లను నివారించ వచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అసిడిటి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
అరటికాయ
అరటి పండులో చక్కెరలు ఎక్కువ. అందుకే పండు తినడానికి బరువు పెరుగుతామని, షుగర్ పెరుగుతుందని భయం ఉంటుంది. పండులో ఉన్న ప్రయోజనాలతో పాటు చక్కెర తక్కువగా ఉండడం వల్ల అరటి కాయ మరింత ఆరోగ్యవంతమైంది.
త్వరగా జీర్ణం కానీ రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది కనుక మధుమేహ వ్యాధి గ్రస్తులకు అరటికాయ మంచిది. అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధ పడేవారికి ఇది మంచి ఆహారం. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఎంతో మంచిది.
అరటి ఆకు
అరటాకు తినలేము కానీ ఈ ఆకులలో EGCG వంటి పాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఉన్నందు వల్లే గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదైంది. అందుకే కనీసం వేడి వేడి భోజనం తాజ అరటి ఆకులో చెయ్యడం వల్ల కొంత మేలు జరుగుతుంది. ఇవి మంచి యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఇకో ఫ్రెండ్లీ, డిస్పోజబుల్ కూడా.