Munagaku | మునగాకుతో కలిగే ఈ ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు..!

Munagaku | మునగాకుతో కలిగే ఈ ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు..!

Munagaku : ప‌్రకృతి మ‌న‌కు ఎన్నో విధాలుగా సాయ‌ప‌డుతుంది. ప్రకృతిసిద్ధంగా ల‌భించే చెట్ల ద్వారా మ‌న‌కు ఆహారంతోపాటు ఔష‌ధాలు కూడా మెండుగా ల‌భిస్తాయి. ఆహారంగా ఉప‌యోగ‌ప‌డే కొన్ని మొక్కలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి వాటిలో మునగ కూడా ఒక‌టి. మున‌గాకును ఆకు కూర‌గానో, ప‌ప్పులో క‌లెగూర‌గానో లేదంటే ప‌చ్చడిగానో చేసుకుని తిన‌డంవ‌ల్ల ఆరోగ్యానికి చాలా మేలు జ‌రుగుతుంది. మ‌రి మున‌గాకుతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


ప్రయోజనాలు..

వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటంవల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.


పాలకూరతో పోలిస్తే మున‌గాకులో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఈ ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి.


మునగాకులో ఎక్కువగా ఉండే పీచువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువ‌ల్ల మున‌గాకును నిత్యం వాడ‌టంవ‌ల్ల అతిగా తిన‌డం అనే స‌మ‌స్య తీరుతుంది.


మున‌గాకులో ఉండే క్లోరోజనిక్‌ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.


మునగలోని విటమిన్‌-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మున‌గాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్‌ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.