ఊబకాయంతో బాధపడుతున్నారా? ఈ ఆరు పాటించి చూడండి తప్పక తగ్గుతారు..!

Low cholesterol food | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆహారంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే.. సమస్య నుంచి బయటపడేందుకు ముందుగా ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని, పెరిగిన కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను ఎలా తగ్గించాలో.. ఎలా నిర్వహించాలో చాలా మందికి తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని […]

ఊబకాయంతో బాధపడుతున్నారా? ఈ ఆరు పాటించి చూడండి తప్పక తగ్గుతారు..!

Low cholesterol food | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆహారంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే.. సమస్య నుంచి బయటపడేందుకు ముందుగా ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని, పెరిగిన కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను ఎలా తగ్గించాలో.. ఎలా నిర్వహించాలో చాలా మందికి తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ఆహారాలు హాని చేస్తాయని పేర్కొంటున్నారు. వ్యాయామంతో పాటు, మీరు ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.

  • మాంసంలో ఎక్కువగా ప్రొటీన్స్‌, విటామిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాల్లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. సంతృప్త కొవ్వును అధికంగా తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిని ప్రభావితం చేస్తుంది.
  • తీపి, చక్కెర పదార్థాలను తినడంతో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చక్కెర ఉన్న పదార్థాలకు బదులుగా తీపిగా ఉండే పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఆహారంలో సంతృప్త కొవ్వు పదార్థాలను తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు మళ్లీ మళ్లీ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటే, అది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ఆహారంలో ఓట్స్, బార్లీ, యాపిల్స్, బీన్స్, అవిసె గింజలు, చియా గింజలను చేర్చుకోండి. తగినంత మొత్తంలో కరిగే ఫైబర్ తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది.
  • ఆహారంలో సంతృప్త కొవ్వును తీసుకోకండి. కానీ, మీ రోజువారీ ఆహారంలో ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి. ఆహారంలో గింజలు, అవకాడో మరియు విత్తనాలను చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.
  • ఆహారంలో పుష్కలంగా కూరగాయలను చేర్చుకోవాలి. ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదు. బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి.