మన కోవాక్సిన్ భద్రమేనా? తయారీలో లోపాలు! క్లినికల్ ట్రయల్స్‌లోనూ అవకతవకలు!
వెలుగులోకి కొత్త విషయాలు రాజకీయ ఒత్తిడులతో కొన్ని ప్రక్రియల దాటవేత మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌లోనూ అవకతవకలు ప్రపంచవ్యాప్తంగా కోవాక్సిన్ సస్పెండ్ చేసి డబ్య్లూహెచ్ఓ విధాత: అత్యంత ప్రతిష్టాత్మకంగ స్వదేశీ వాక్సిన్‌గా మార్కెట్‌లోకి కోవాక్సిన్ విడుదలయ్యింది. దీన్ని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. అయితే భారత డ్రగ్ రెగ్యూలేటర్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ వాక్సిన్ విషయంలో కొన్ని వివాదాస్పద విషయాలను తమ పరిశోధనా ఫలితాల్లో వెల్లడి చేసింది. […]

- వెలుగులోకి కొత్త విషయాలు
- రాజకీయ ఒత్తిడులతో కొన్ని ప్రక్రియల దాటవేత
- మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌లోనూ అవకతవకలు
- ప్రపంచవ్యాప్తంగా కోవాక్సిన్ సస్పెండ్ చేసి డబ్య్లూహెచ్ఓ
విధాత: అత్యంత ప్రతిష్టాత్మకంగ స్వదేశీ వాక్సిన్‌గా మార్కెట్‌లోకి కోవాక్సిన్ విడుదలయ్యింది. దీన్ని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. అయితే భారత డ్రగ్ రెగ్యూలేటర్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ వాక్సిన్ విషయంలో కొన్ని వివాదాస్పద విషయాలను తమ పరిశోధనా ఫలితాల్లో వెల్లడి చేసింది.
ఈ వ్యాక్సిన్ తయారీ, పరిశోధనల్లో భాగం పంచుకున్న నిపుణుల్లో ఒకరు మాత్రమే కాదు కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అధికారి చెప్పిన దాన్ని బట్టి వ్యాక్సిన్ తయారిలో కొన్ని ప్రక్రియలను రాజకీయ ఒత్తిడుల కారణంగా దాట వెయ్యల్సి వచ్చిందని సంజాయిషీగా చెబుతుండడం గమనార్హం. ట్రయల్ ప్రక్రియలను రెగ్యులేటర్ సంస్థ పరిశీలించినపుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ అత్యంత వేగంగా జరగడం వల్ల వ్యాక్సిన్ పరీక్షల్లో చాలా విషయాలు నిర్లక్ష్యం అయ్యాయని తెలుస్తోంది.
ఇలాంటి ఆరోపణలకు సమాధానంగా కంపెనీ సీనియర్ అధికారి స్పందించడం ఇదే మొదటి సారి. వ్యాక్సిన్ తయారీ విధానంలో జరిగిన లోపాలను వివరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్సిన్‌ను యూన్ ఏజెన్సీలకు జరిగే సరఫరాను నిలిపివేసింది.
కోవాక్సిన్ కోసం ఎమర్జెన్సీ యూజ్ లైసెన్స్ అందిన తర్వాత భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో కొన్ని మార్పులు చేసినట్లు డబ్య్లూహెచ్ఓ తెలిపింది. చేసిన మార్పుల గురించి కంపెనీ తెలియ జేయలేదు. వాటిని సరిదిద్దుకోవడం గురించి సంధించిన ప్రశ్నలకు కూడా ప్రతి స్పందించలేదని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా తయారైన అన్ని కోవిడ్ వ్యాక్సిన్లలో కేవలం కోవాక్సిన్ ను మాత్రమే డబ్య్లూహెచ్ ఓ సస్పెండ్ చేసింది.
వ్యాక్సిన్ నిర్ధారణకు నిర్వహించిన మూడు దశల క్లినికల్ ట్రయల్స్ లో చాలా అవకతవకలు ఉన్నాయని STAT నివేదిక చెబుతోంది. రిపోర్టర్ ఎడ్ సిల్వర్ మాన్ నేతృత్వంలో జరిగిన అవుట్ ఇన్వెస్టిగేషన్ వివరాల ప్రకారం ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీస్‌లో ప్రచురించిన వివరాలతో పోలిస్తే స్పెసిఫిక్ ట్రయల్ ప్రొటోకాల్ డాక్యూమెంట్ల వివరాల్లో తేడాలు గమనించారు.
అందుకే సిల్వర్ మాన్ తన నివేదికలో ‘‘పత్రాలను సమీక్షించినపుడు మొదటి రెండు ట్రయల్స్ లో నమోదు చేసుకున్న వారి సంఖ్యలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది’’ అని రాశారు. దీని గురించి భారత్ బయోటెక్ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణమోహన్ స్పందిస్తూ రిమోట్‌గా పనిచేసే వ్యక్తుల మధ్య సమన్వయంలో ఉన్న ఇబ్బందుల వల్లే ఇలా జరిగిందని అన్నారు.
మరో అదికారి రేష్మా రామచంద్రన్ కూడా ఇవ్వన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సినవే కానీ కోవాక్సిన్‌ను తిరస్కరించాల్సినంత పెద్దవి కావని కూడా సమర్థించుకున్నారు. ఏది ఏమైనా ఎవరి వాదనలు ఎలా ఉన్నా కూడా భారత్ బయోటెక్ కోవాక్సిన్ విడుదలలో తొందర పడిందని మాత్రం సర్వత్రా వినిపిస్తున్న వాదన.