కర్పూరంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
విధాత: కర్పూరం పూజా ద్రవ్యంగా ఉయోగించడం మాత్రమే తెలుసు మనలో చాలా మందికి.. కానీ ఇది రకరకాలుగా ఉపయోగపడుతుందని తెలుసా? ఔషధంగా, సుగంధ ద్రవ్యంగా, కీటక నాశినిగా, ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. హిందువులందరూ కర్పూరాన్ని పూజలో వాడడం పరిపాటి. అసలు కర్పూర నీరాజనం లేకుండా పూజ పూర్తవదు కూడా. రకరకాల పరిహారాల్లోనూ వాడుతుంటారు. నిత్య జీవితంలో రకరకాల సమస్యలకు కర్పూరం మంచి పరిష్కారాలు చూపుతుంది. అవేమిటో తెలుసుకుందాం. చాలా చవకగా దొరికే కర్పూరంతో ఎన్నెన్ని ప్రయోజనాలో […]

విధాత: కర్పూరం పూజా ద్రవ్యంగా ఉయోగించడం మాత్రమే తెలుసు మనలో చాలా మందికి.. కానీ ఇది రకరకాలుగా ఉపయోగపడుతుందని తెలుసా? ఔషధంగా, సుగంధ ద్రవ్యంగా, కీటక నాశినిగా, ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
హిందువులందరూ కర్పూరాన్ని పూజలో వాడడం పరిపాటి. అసలు కర్పూర నీరాజనం లేకుండా పూజ పూర్తవదు కూడా. రకరకాల పరిహారాల్లోనూ వాడుతుంటారు. నిత్య జీవితంలో రకరకాల సమస్యలకు కర్పూరం మంచి పరిష్కారాలు చూపుతుంది. అవేమిటో తెలుసుకుందాం. చాలా చవకగా దొరికే కర్పూరంతో ఎన్నెన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఎన్నో ఉపయోగాల కర్పూరం. కర్పూరం ప్రత్యేకమైన మొక్క ద్వారా దొరికే రసాయనం. కర్పూరం సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది.
- జపనీస్
- భీమ్సేని
- ప్రతి కపూర్
కర్పూరం పూజ కోసం, ఔషధంగానూ, సువాసనకు వాడుతారు. కర్పూరం సువాసన ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు ఏకాగ్రతను కూడా కలిసగిస్తుంది. దీని ద్వారా అగ్ని కఫ, వాతాలను సంతులన పరుస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది.
కర్పూరంలో ఔషధ గుణాలు
కర్పూర నూనెతో చేసే మర్ధన వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. వాపులు తగ్గుతాయి. మొటిమలు, జిడ్డు చర్మానికి మంచిది. కీళ్ల నొప్పులు ఉన్న వారు కర్పూర మిశ్రమాన్ని లేపనంగా రాసుకుంటే నొప్పి తగ్గుతుంది.
కర్పూరం కలిగిన బామ్ రాసుకుంటే మెడనొప్పినుంచి ఉపశమనం దొరుకుతుంది. కఫం చేరడం వల్ల ఛాతి పట్టేసినట్టు ఉంటే కర్పూర నూనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పికి శొంఠి, తెల్ల చందనంతో కర్పూరం కలిపి చేసిన లేపనపు కట్టుతో పరిష్కారం దొరకుతుంది.
కర్పూరం వేడినీటిలో వేసుకుని ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన దగ్గుకు ఆవ నూనె లేదా నువ్వుల నూనెలో కలిపిన కర్పూరంతో మర్ధనా చేస్తే త్వరగా తగ్గుతుంది.
కర్పూరం జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో జుట్టు రాలడం, త్వరగా చుండ్రు రావడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తునే ఉన్నాయి. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి వాడితే చుండ్రు నుంచి విముక్తి దొరుకుతుంది. అంతే కాదు జుట్టు కూడా రాలడం తగ్గుతుంది.
రూమ్ ప్రెషనర్
కర్పూరాన్ని మెత్తగా పొడి చేసి లావెండర్ నూనెలో కలిపి స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేస్తే ఇల్లు సువాసనతో ఘుమఘుమ లాడుతుంది. మంచి ఎయిర్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.
చర్మం మీద దురదలు, మంటగా ఉంటే ఉపశమనం కోసం ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక చెంచా కర్పూరం కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మడిమల పగుళ్ల సమస్య ఉన్నవారు వేడి నీటిలో కర్పూరం వేసి అందులో కాళ్లు ఉంచాలి. ప్రతి రాత్రి నిద్ర పోయే ముందు ఇలా చేస్తే త్వరలోనే పగుళ్లు తగ్గుతాయి.