మగవారిలో జుట్టు రాలడానికి కారణం ఏంటో తెలుసా?

వెయ్యి మందిపై నిపుణుల స్ట‌డీ విధాత‌: కొన్ని రకాల డ్రింక్స్ పురుషుల్లో జుట్టు రాలిపోవడానికి కారణం అని నిపుణులు అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, టీలు తాగేవారిలో జుట్టు రాలడం 30 శాతం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు గుర్తించారట. బీజింగ్ లోని సింఘువా విశ్వవిద్యాలయ నిపుణులు ఒక స్టడీ చేశారు. న్యూట్రియెంట్స్ జర్నల్ లో వివరాలు ప్రస్తావించారు. కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా నీళ్లు, స్పోర్ట్స్ డ్రింక్స్ మాదిరిగా ఎక్కువ చక్కెరలు ఉండే డ్రింక్స్ తీసుకునే పురుషుల్లో జుట్టు […]

  • By: krs    health    Jan 09, 2023 3:35 PM IST
మగవారిలో జుట్టు రాలడానికి కారణం ఏంటో తెలుసా?
  • వెయ్యి మందిపై నిపుణుల స్ట‌డీ

విధాత‌: కొన్ని రకాల డ్రింక్స్ పురుషుల్లో జుట్టు రాలిపోవడానికి కారణం అని నిపుణులు అంటున్నారు.
ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, టీలు తాగేవారిలో జుట్టు రాలడం 30 శాతం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు గుర్తించారట. బీజింగ్ లోని సింఘువా విశ్వవిద్యాలయ నిపుణులు ఒక స్టడీ చేశారు. న్యూట్రియెంట్స్ జర్నల్ లో వివరాలు ప్రస్తావించారు.

కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా నీళ్లు, స్పోర్ట్స్ డ్రింక్స్ మాదిరిగా ఎక్కువ చక్కెరలు ఉండే డ్రింక్స్ తీసుకునే పురుషుల్లో జుట్టు రాలుతోందట. ఇవి తాగని వారితో పోలిస్తే రోజుకు ఒకటి కంటే ఎక్కువ స్వీట్ డ్రింక్స్ తాగేవారిలో జుట్టు రాటడం 42 శాతం వరకు ఎక్కువగా ఉందని అంటున్నారు.

జుట్టు ఎక్కువగా రాలుతోందని చెప్పే పురుషులు దాదాపుగా వారానికి 12 డ్రింక్స్ తీసుకుంటున్నారట. రోజుకు ఒకటికి మించకుండా ఈ డ్రింక్స్ తీసుకుంటున్నా వారిలో ఈ సమస్య కాస్త తక్కువే ఉందట.
ఈ అధ్యయనం కోసం 18 నుంచి 45 మధ్య వయసున్న వెయ్యి మందికి పైగా చైనీస్ పురుషులను ఎంపిక చేశారట.

వారి ఆహారపు అలవాట్లు, ఇతర మానసిక, శారీరక ఆరోగ్య అంశాలను అధ్యయనం చేసి ఈ రిపోర్టు విడుదల చేశారు. జుట్టు రాలడంలో కేవలం డ్రింక్స్ వల్ల మాత్రమే అని చెప్పలేమని కూడా అంటున్నారు. ఫాస్ట్ ఫూడ్ ఎక్కువగా తినే వారిలో, కూరగాయలు తక్కువగా తినే పురుషుల్లో జుట్టురాలే సమస్య ఎక్కువని అంటున్నారు.

అంతేకాదు స్ట్రెస్ వంటి మానసిక స్థితులు కూడా జుట్టు రాలేందుకు కారణం అవుతున్నాయట. సమతుల ఆహారం తీసుకోవడం జుట్టు రాలడం నివారించాలంటే దగ్గరి దారి అని ఈ పరిశోధన సారాంశం.
శరీరంలో కణవిభజన ఎక్కువ గా జరిగే కణాల్లో హెయిర్ ఫోలికిల్స్ రెండవ స్థానంలో ఉంటాయి. వీటికి బాలెన్స్ డ్ డైట్, అన్ని రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం అని లండన్ కు చెందిన చర్మ డెర్మటాలజిస్ట్ డాక్టర్ షారన్ వాంగ్ అంటున్నారు.

వీటిలో లీన్ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటిమన్స్, మినరల్స్ ఇలా అన్ని రకాల పోషకాలు తప్పకుండా ఉండాలి. అయితే జుట్టు శరీరంలో ముఖ్యమైన అవయవం కాదు కనుక చాలామంది జుట్టు పెరుగుదల గురించి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. అయితే బరువు తగ్గేందుకు చేసే డైట్లు, పోషకాహార లోపాలు జుట్టు పలుచబడేందుకు ముఖ్యమైన కారణాలు.

రోజు కొంత జుట్టు రాలుతుంది సహజంగానే. ప్రతి రోజు 50 నుంచి 100 వెంట్రుకల వరకు రాలిపోవడం గురించి ఆలోచించక్కర్లేదు. కానీ అంతకు మించితే మాత్రం మరేదైనా అనారోగ్య సూచన కావచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అకస్మాత్తుగా జుట్టు రాలడం మొదలైనా, తక్కువ సమయంలోనే మాడు మీద జుట్టు పలుచబడుతున్నట్టు గమనించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం అనేది వారి సలహా.