Health Tips | గాల్‌బ్లాడర్‌లో రాళ్లు వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి..!

Health Tips | గాల్‌బ్లాడర్‌ (పిత్తాశయం) లో రాళ్ల సమస్య చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్య వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవల కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యకు సకాలంలో చికిత్స అవసరం. పిత్తాశయంలో రాళ్లు ఉంటే పుల్లటి తేన్పు, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, వాంతులు, పొట్టలో భారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips | గాల్‌బ్లాడర్‌లో రాళ్లు వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి..!

Health Tips : గాల్‌బ్లాడర్‌ (పిత్తాశయం) లో రాళ్ల సమస్య చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్య వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవల కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యకు సకాలంలో చికిత్స అవసరం. పిత్తాశయంలో రాళ్లు ఉంటే పుల్లటి తేన్పు, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, వాంతులు, పొట్టలో భారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిట్కాలు..

పుదీనా టీ

పుదీనాలో ఉండే టెర్పెన్ అనే సమ్మేళనం పిత్తాశయ రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో తోడ్పాటును ఇస్తుంది. ఇందులో ఉండే టెర్పెన్ అనే సమ్మేళనం రాయిని పగలగొట్టడానికి, కరిగించడానికి సాయపడుతుంది. కాబట్టి పుదీనా టీ తీసుకోవడం ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది.

ఆపిల్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడంవల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. రాళ్లు కరుగుతాయి. అందుకు ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి క్రమం తప్పకుండా తీసుకోవాలి.

పియర్స్

పియర్స్‌లో ఉండే పెక్టిన్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌తో తయారైన రాళ్లను కరిగించడంలో సాయపడతాయి. పియర్‌లో ఉండే పెక్టిన్ అనేది ఒక రకమైన డైటరీ ఫైబర్.

పసుపు టీ

పసుపు టీని తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. గ్యాస్‌ టీలోని యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో, వాటిని శరీరం నుంచి తొలగించడంలో సాయపడుతాయి.

బొప్పాయి

గాల్‌బ్లాడర్‌ రాళ్ల చికిత్సలో బొప్పాయి చాలా ప్రభావం చూపుతుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ మీ పేగులలోని ప్రోటీన్‌లను జీర్ణం చేయడంలో సాయపడుతుంది. ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా రాళ్లను కరిగించి వాటిని తొలగించడంలో తోడ్పడుతుంది.