ఈ టిప్స్‌తో.. సులభంగా బరువు తగ్గొచ్చు!
విధాత: కొత్త సంవత్సరం బరువు తగ్గాలన్న నిర్ణయం తీసుకున్నారా? ఎలా తగ్గాలా అని రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారా? మరి సులువుగా బరువు తగ్గేందుకు కొన్ని దారులను నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం. బరువు తగ్గాలంటే ముందుగా చెయ్యాల్సింది క్యాలరీ బర్నింగ్. అంటే తీసుకునే క్యాలరీల కంటే కరిగించే క్యాలరీలు ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం కచ్చితంగా శారీరక శ్రమ అవసరం. అంతే కాదు తీసుకునే ఆహారం ద్వారా కూడా క్యాలరీలు తక్కువ అందేలా జాగ్రత్త […]

విధాత: కొత్త సంవత్సరం బరువు తగ్గాలన్న నిర్ణయం తీసుకున్నారా? ఎలా తగ్గాలా అని రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారా? మరి సులువుగా బరువు తగ్గేందుకు కొన్ని దారులను నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే ముందుగా చెయ్యాల్సింది క్యాలరీ బర్నింగ్. అంటే తీసుకునే క్యాలరీల కంటే కరిగించే క్యాలరీలు ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం కచ్చితంగా శారీరక శ్రమ అవసరం. అంతే కాదు తీసుకునే ఆహారం ద్వారా కూడా క్యాలరీలు తక్కువ అందేలా జాగ్రత్త పడాలి.
- హులా హోపింగ్ సరదాగా ఉండడం మాత్రమే కాదు చాలా మంచి వ్యాయామం. కొత్తగా మొదలు పెట్టేవారు కాస్త బరువు ఎక్కువ ఉన్న దాన్ని తిప్పేందుకు ప్రయత్నించండి. ఇది తిప్పడం సులభం. నెమ్మదిగా తేలికైన వ్యాయామంగా మార్చుకోవచ్చు.
- షుగర్ తక్కువగా ఉండే ప్యాక్ డ్ ఫూడ్‌ను పెద్దగా నమ్మొద్దు. లేబుల్ పూర్తిగా చదివాకే వాడడం మంచిది.
- బరువు తగ్గడం కోసం నారింజ రసం తీసుకోవడం చాలా మంచిది. దీనిలో హెస్పెరిడిన్ అనే రకం నారింజ రసం ఆరోగ్యానికి చాలా మంచిది.
- రిషి మష్రూమ్స్ శరీరంలోని కొవ్వుల శోషణకు బాగా పనిచేస్తాయట. కొవ్వు నిల్వ చేసుకునే విధానాన్ని నిర్మూలిస్తాయట. శరీరం ఆక్సిజన్ ను వినియోగించే విధానాం పెరగడంతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. అందుకే మష్రూమ్ వినియోగం పెంచాలి.
- స్కేటింగ్ తో కూడా కేలరీలను తగ్గించవచ్చు. జాగింగ్ కంటే ఇది మంచిది. స్కేటింగ్ తో కీళ్ల మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
- రోజులో నీటి వినియోగం పెంచడం వల్ల బరువు తగ్గొచ్చు. భోజనానికి ముందు నీళ్లు తాగడం ద్వారా ఆకలి తగ్గినట్టు అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి కూడా.
- వాకింగ్ నుంచి జాగింగ్ వరకు ఏదైనా అవుట్ డోర్ వర్కవుట్ ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ కొవ్వు కరిగించవచ్చు. దీనితో ఒత్తిడిని నియంత్రించవచ్చు.
- మనసులో బరువు తగ్గినట్టు ఊహించుకోవాలి. అటువంటి ఒక విజువలైజేషన్ మనసులో చేసుకోవాలి. ఆ ఊహను నిజం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడితే బరువు తగ్గే పని సులభం అవుతుందట.
- బరువు తగ్గాలన్న మీ ఆలోచనను ప్రొత్సహించే వారు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. ప్రోత్సాహం ఎప్పుడూ ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది.
- ఆహారంలో ఫైబర్ కంటెంట్ పెంచాలి. ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారంలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
- సరిపడా నిద్ర పోవాలి. నిద్ర బరువును మేనేజ్ చేస్తుంది కనుక 6,7 గంటల నిద్ర ప్రతి రోజూ తప్పనిసరి.
- స్టీమ్ బాత్ లేదా వేడి నీటి స్నానం కూడా శరీరంలో క్యాలరీలను కరిగిస్తుంది. వ్యాయామం చెయ్యడానికి బద్ధకించిన రోజు ఆవిరి స్నానానికి వెళ్లడం మంచి ఆప్షన్.