పొద్దున్నే నిద్ర లేవాలనుకుంటున్నారా? ఇలా సాధన చెయ్యండి..

విధాత‌: ప్రతి ఆదివారం పడుకునే ముందు ఈ వారం నుంచి ప్రతి రోజూ పొద్దున్నేనిద్ర లేవాలని అనుకుంటాం. కానీ మెలకువ రాదు.. అది సాధ్య పడదు. ఏ అలారమో పెట్టుకున్నా సరే బద్ధకంగా అనిపించి నిద్రలేవడానికి శరీరం ఒళ్లు సహకరించదు. ఈ రోజు రాత్రి త్వరగా నిద్ర పోవాలని ఆశ పడతాం. కానీ ఏం చేసినా నిద్ర పట్టదు, ఇక ఉదయాన్నే నిద్ర లేవడం సాధ్య పడదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? […]

పొద్దున్నే నిద్ర లేవాలనుకుంటున్నారా? ఇలా సాధన చెయ్యండి..

విధాత‌: ప్రతి ఆదివారం పడుకునే ముందు ఈ వారం నుంచి ప్రతి రోజూ పొద్దున్నేనిద్ర లేవాలని అనుకుంటాం. కానీ మెలకువ రాదు.. అది సాధ్య పడదు. ఏ అలారమో పెట్టుకున్నా సరే బద్ధకంగా అనిపించి నిద్రలేవడానికి శరీరం ఒళ్లు సహకరించదు. ఈ రోజు రాత్రి త్వరగా నిద్ర పోవాలని ఆశ పడతాం. కానీ ఏం చేసినా నిద్ర పట్టదు, ఇక ఉదయాన్నే నిద్ర లేవడం సాధ్య పడదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? ఈ సమస్యలకు పరిష్కారం ఉందా? ఉంటే ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.

కొంత‌మంది మ‌ధ్యాహ్నం.. మ‌రికొంతమంది రాత్రి చురుకుగా..

మనలో కొంత మంది మధ్యాహ్నాలు చురుకుగా ఉంటారు. ఇంకొందరు రాత్రి పూట చురుకుగా పనులు చేస్తారు. ఇలాంటి అలవాటును ఆ వ్యక్తికి సంబంధించిన క్రోనోటైప్ అంటారు. రాత్రి నిద్రించే సమయంలో, మధ్యాహ్నాలు మెలకువగా ఉన్న సమయాల్లో మనలోపల జరిగే మెకానిజాన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. క్రోనోటైప్, సర్కాడియన్ రిథమ్ వేరువేరుగా ఉన్నప్పటికీ రెండింటి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఒక షెడ్యూల్ ప్రకారం సర్కాడియన్ రిథమ్ కు శిక్షణ ఇవ్వడం సాధ్యమే కానీ క్రోనోటైప్ ను మార్చడం సాధ్య పడదని స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది.

జీవితాంతం ఒకేలా క్రోనోటైప్

క్రోనోటైప్ ఎలా డిసైడ్ అవుతుందనేది చెప్పడం సాధ్యం కాదని, జెనెటిక్ కారణాలు ఉండి ఉంటాయని సైకియాట్రీ నిపుణులు జామీ జైజ్జర్ అభిప్రాయపడ్డారు. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర వేళలు మారుతుంటాయి. కానీ క్రోనోటైప్ జీవితాంతం ఒకే విధంగా ఉంటుంది. టీనేజ్ తో పోలిస్తే వయసు పెరుగుతుంటే నిద్ర తగ్గిపోతుంది.

సర్కాడియన్ రిథమ్ కు శిక్షణ

ఉదాహరణకు ఉదయం చురుకుగా ఉండే ఒక వ్యక్తి 17 ఏళ్ల వయసులో 11,12 గంటలకు నిద్ర పోతుండ వచ్చు. అదే రాత్రుళ్లు చురుకుగా ఉండే వ్యక్తి 3 గంటలకు నిద్రపోవచ్చు. 30,40 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఉదయపు వ్యక్తి 10 గంటలకు మారవచ్చు. రాత్రి వ్యక్తి 12 వరకు నిద్ర పోవచ్చు అని జైట్జర్ విశ్లేషించారు. ప్రతి రోజూ రొటీన్ గా ఉండే పనులు మన నిద్రా సమయాన్ని నిర్ణయిస్తుంటాయి. ఈ పనులకు అంతరాయం కలగకుండా సర్కాడియన్ రిథమ్ కు శిక్షణ అందించాలి.

పొద్దున్నే నిద్ర లేవాలంటే?

అందరికీ ఉదయమే నిద్ర లేవాలన్న ఆశ ఉంటుంది. కానీ లేవడం సాధ్య పడదు. రాత్రుళ్లు చురుకుగా ఉండే క్రోనోటైప్ వ్యక్తులకు మధ్యాహ్నాలు పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటే మరింత ఇబ్బంది పడతారు. ఇలాంటి కష్టం నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు.

రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా నిద్ర‌

నిద్రతో సంబంధం లేకుండా సూర్యాస్తమయం తర్వాత చీకటి, చల్లని వాతావరణం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ శరీరంలో విడుదలవుతుంది. ఇది నిద్రకు దొహదం చేసే హార్మోన్. ఈ రోజుల్లో కృత్రిమ లైట్లు, వాటి వల్ల పుట్టే వేడి వల్ల సర్కాడియన్ రిథమ్ చాలా ప్రభావితం అవుతోంది. అందువల్ల రాత్రి పగలు తేడా నిద్రకు ఉండడం లేదు.

మెలటోనిన్ బదులుగా గ్లూకోజ్ విడుదల

యంత్రాలు వ్యాయామం చెయ్యడం, పెద్ద వెలుతురు కలిగిన లైట్ల వల్ల శరీరంలో మెలటోనిన్ బదులుగా గ్లూకోజ్ విడుదల అవుతుంది. ఇది నిద్ర షెడ్యూల్ ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. మరి మార్నింగ్ పర్సన్ గా మారాలంటే మాత్రం నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తుల పాటించాలి.

  • రాత్రి త్వరగా నిద్రపోతే కానీ ఉదయం త్వరగా నిద్రలేవడం సాధ్యం కాదు. అలా నిద్ర పోవాలంటే మాత్రం మెలటోనిన్ విడుదలకు అవసరమైన పరిస్థితులు కల్పించాలి. ఇలా చయ్యడం వల్ల సర్కాడియన్ రిథమ్ ట్రైన్ అవుతుంది.
  • నిద్రపోవాలనుకునే ప్రదేశం చీకటిగా, చల్లగా , శుభ్రంగా ఉంచుకోవాలి.
  • రాత్రి పొద్దుపోయాక కూడా లైట్ వెలుతురులో ఉండకూడదు. ఇది శరీరానికి విశ్రాంతి కావలన్నా సందేశం అందివ్వదు. ఫలితంగా నిద్ర రాదు.
  • రాత్రుళ్లు గాడ్జెట్స్ కు దూరంగా గడపడం వల్ల లైటు వెలుతురుకు ఎక్కువ ఎక్స్ పోజ్ కారు కనుక మెలటోనిన్ విడుదలకు దోహదం చేస్తుంది.

జాగ్రత్తలు చిన్నవే కానీ జీవితంలో పెద్ద మార్పు తేవచ్చు. కనుక కొత్త సంవత్సరంలో వీటి మీద కాస్త దృష్టి పెట్టడం మంచిది.