అరిటాకు భోజనం అద్భుతం.. ఆరోగ్యం కూడా!

తెలుగింటి భోజనం అనగానే పచ్చని అరటాకులో రకరకాల వంటలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ధక్షిణ భారత దేశంలో అరటాకు భోజనం సాంప్రదాయం. దీని వెనుక రకరకాల శాస్త్రబద్ధమైన లాభాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో ప్రతి రోజూ అరటి ఆకులోనే భోంచేసే వారు. ఇప్పటికీ అరటాకులో అడపాదడపా భోంచేస్తున్నారు. అయితే అరటాకులో భోంచెయ్యడంలో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆకు పెద్దది కదా అరటాకు సైజ్ పెద్దది కావడం వల్ల వడ్డించేందుకు అనువుగానూ, తినడానికి సౌకర్యంగానూ ఉంటుంది. కేరళ […]

అరిటాకు భోజనం అద్భుతం.. ఆరోగ్యం కూడా!

తెలుగింటి భోజనం అనగానే పచ్చని అరటాకులో రకరకాల వంటలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ధక్షిణ భారత దేశంలో అరటాకు భోజనం సాంప్రదాయం. దీని వెనుక రకరకాల శాస్త్రబద్ధమైన లాభాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో ప్రతి రోజూ అరటి ఆకులోనే భోంచేసే వారు. ఇప్పటికీ అరటాకులో అడపాదడపా భోంచేస్తున్నారు. అయితే అరటాకులో భోంచెయ్యడంలో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.

ఆకు పెద్దది కదా

అరటాకు సైజ్ పెద్దది కావడం వల్ల వడ్డించేందుకు అనువుగానూ, తినడానికి సౌకర్యంగానూ ఉంటుంది. కేరళ వారి సద్య గురించి తెలుసా? సద్య అంటే కేరళ సంప్రదాయంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చాలా రకాల పదార్థాలు వడ్డిస్తారు కనుక వడ్డించేందుకు పెద్ద ప్లేట్ అవసరం అవుతుంది. అలాంటపుడు అరటాకు వడ్డించడానికి అనువుగా ఉంటుంది. అన్ని పదార్థాలు ఒకేసారి వడ్డించడం వీలవుతుంది. అందుకే సధ్యలో అరటాకునే వాడుతారు.

ధర కూడా అందుబాటులో

అరటాకులు దొరకడం సులభం మాత్రమే కాదు చవక కూడా. మార్కెట్ లో విరివిగా దొరుకుతాయి కూడా. నిజానికి అరటి తోట ఉన్నవారేవరైనా తెలిసిన వారైతే ఉచితంగా కూడా దొరకవచ్చు.

నీళ్లు పీల్చవు

దక్షిణభారత క్యుసిన్లో సంబార్, రసం వంటి లిక్విడ్ గా ఉండే పదార్థాలు ఎక్కువ. అందువల్ల అరటాకు భోజనానికి అనువుగ ఉంటుంది. ఆహార పదార్థాలలో ఉండే నెయ్యి, నూనె కూడా ఆకుకు అంటుకోవు. కనుక భోంచెయ్యడానికి అరటాకు బావుంటుంది.

చక్కని సువాసన

తాజా అరటాకు మీద సహజంగా పలుచని మైనపు పొర ఉంటుంది. వేడివేడి పదార్థాలు ఆకులో వడ్డించినపుడు మైనం కరుగుతుంది. అలా కరిగినపుడు ఒక రకమైన కమ్మని వాసన వస్తుంది. అంతేకాదు దీని వల్ల ఆహార పదార్థాలకు ఒక ప్రత్యేకమైన రుచి ఇనుమడిస్తుంది. ముఖ్యంగా వేడి వేడి రసం లేదా సాంబార్, అన్నం కలిపి అరటాకులో తింటే ఆ రుచిలో తేడాను సులభంగా గుర్తించవచ్చు. అందుకే అరటాకులో భోంచెయ్యడం ప్రత్యేక అనుభవం అంటుంటారు.

శాస్త్రాల్లోనూ ఉంది

అనాదిగా అరటాకు ప్రత్యేకత గురించి రకరకాల సాహిత్యాల్లో వివరించారు. చాలా క్రతువులు, పూజలు నిర్వహించినపుడు ఆ తర్వాత వడ్డించే భోజనం అరటాకులో ఉండాలని ప్రత్యేకంగా వివరించారు.

అరటాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అరటాకులు యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలో పొరపాటున సూక్ష్మజీవులు చేరినా హరించి వేస్తుంది. అరటాకు మనం తినక పోవచ్చు కానీ తాజా అరటాకులో వేడివేడి పదార్థాలు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో చేరుతాయి.

ఇకో ప్రెండ్లీ

ప్లాస్టిక్ తో చేసి డిస్పోజబుల్ ప్లేట్లు డీకంపోజ్ కావడానికి సంవత్సరాల కాలం పడుతుంది. పర్యావరణానికి తీరని నష్టం వీటి వల్ల. కానీ అరటి ఆకులు ప్రకృతి సిద్ధమైనవి. విరివిగా లభించేవి కూడా. డిస్పోజబుల్ కూడా. కనుక వాడుకోవడం సులభం.
శుభ్రమైనవి.

వాటర్ ప్రూఫ్ కనుక వీటి మీద ఉపయోగించిన రసాయనాలు ఆకుకు అంటుకోవు. కాబట్టి హాని తక్కువ. వడ్డించే ముందు శుభ్రం చేసుకోవడం సులభం. అరటాకులను కొన్ని ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. కొన్ని రకాల మందులను ప్యాక్ చేసేందుకూ కూడా వినియోగిస్తారు.