ప్రతీ పని స్క్రీన్ వెలుగులో.. ఇవి పాటిస్తేనే మీ కళ్లు సేఫ్..!
విధాత: కళ్లు మనసుకు వాకిళ్లు. అంతేకాదు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని కూడా చెప్పారు. ఎక్కువ కాలం పాటు స్క్రీన్ తో గడపడం, నిద్ర తగినంత లేకపోవడం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో కళ్లు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇది వరకు రోజుల్లో స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వాడేవారు కానీ ఇప్పుడు పనులన్నీ స్క్రీన్ పైనే జరుగుతున్నాయి. అదేకాక రిలాక్స్ కావడానికి కూడా మళ్లీ స్క్రీన్ నే ఉపయోగిస్తున్నారు. ఇది కళ్లకు అపార నష్టం […]

విధాత: కళ్లు మనసుకు వాకిళ్లు. అంతేకాదు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని కూడా చెప్పారు. ఎక్కువ కాలం పాటు స్క్రీన్ తో గడపడం, నిద్ర తగినంత లేకపోవడం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో కళ్లు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
ఇది వరకు రోజుల్లో స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వాడేవారు కానీ ఇప్పుడు పనులన్నీ స్క్రీన్ పైనే జరుగుతున్నాయి. అదేకాక రిలాక్స్ కావడానికి కూడా మళ్లీ స్క్రీన్ నే ఉపయోగిస్తున్నారు. ఇది కళ్లకు అపార నష్టం కలిగిస్తోంది. ఎక్కువ సమయం స్క్రీన్ తో గడపడం వల్ల కళ్లు పొడిబారడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇవే కాదు మెడ, భుజం నొప్పులు పెరగడానికి కూడా కారణం ఇదేనట. స్క్రీన్ నుంచి వచ్చే తెల్లని వెలుగు వల్ల నిద్ర లేమి సమస్యలు కూడా వస్తున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది.
చిన్న చిన్న జాగ్రత్తలతో కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కళ్ల సంరక్షణలో మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం. వాటి గురించిన అవగాహన అవసరం. కళ్లెప్పుడూ గోరువెచ్చని నీటితో కడుగకూడదు. కళ్లు కడుక్కునేందుకు చల్లని లేదా గది ఉష్టోగ్రతలో ఉన్న నీటిని మాత్రమే వాడాలి.
తరచుగా రెప్పలార్చడం కంటి ఆరోగ్యానికి మంచిది. చాలా మందికి రెప్పలార్చకుండా ఉండే అలవాటు ఉంటుంది. దీర్ఘకాలం పాటు రెప్ప వెయ్యకపోతే కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. రెప్పలార్చడం వల్ల కళ్లలో తేమ నిలిచి ఉంటుంది.
స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించే వారు కళ్లు నొప్పిగా, మంటగా అనిపించిన వెంటనే ఉపశమనం కోసం ఐ డ్రాప్స్ వాడుతుంటారు. ఇవి కంటి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. చాలా మందికి ఐమాస్క్ వేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అది అసలు మంచిదికాదు.
నిద్ర పోతున్నపుడు కళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే వీలుండాలి. కంటికి కోల్డ్ ప్యాక్ వేసుకోవడం మేలు చేస్తుంది. తరచుగా కళ్లను చేతితో తాకడం అంత మంచి అలవాటు కాదు. కళ్లు చేతితో రుద్దడం వల్ల కంటిలో ఉండే సన్నని రక్షణ పొర దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తరచుగా చల్లని నీటితో కళ్లు కడుక్కోవడం మంచి అలవాటు.